Vodafone Idea: కుప్పకూలిన వోడఫోన్ ఐడియా స్టాక్.. కంపెనీ అసలు ప్లాన్ ఇదే..
Vodafone Idea Shares: దేశీయ టెలికాం రంగంలోకి ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో అరంగేట్రంతో పదుల సంఖ్యలో ఉన్న ఆపరేటర్లు కనుమరుగయ్యారు. అయితే బతికేందుకు పోరాడుతున్న వోడాఫోన్ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది.
దేశీయ టెలికాం ఆపరేటర్ వోడఫోన్ ఐడియా ప్రమోటర్లు నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న కంపెనీని కాపాడేందుకు నిధుల సమీకరణకు వెళుతున్నారు. అయితే ఈ సారి దాదాపు రూ.40,000 కోట్లను సేకరించేందుకు బోర్డు ఇప్పటికే ఆమోదం తెలిపింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ప్రమోటర్ ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రిఫరెన్షియల్ షేర్ల అలాట్మెంట్ ద్వారా నిధులను అందించాలని చూస్తున్నట్లు సమాచారం. రూ.20,000-కోట్ల ఈక్విటీ నిధుల సమీకరణ కోసం ప్రమోటర్‌కు ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్, ప్రిఫరెన్షియల్ కేటాయింపుల కలయికకు వెళ్లే అవకాశం ఉందని వార్తా కథనాల ప్రకారం తెలుస్తోంది.

ఈ వార్తల నేపథ్యంలో వోడాఫోన్ ఐడియా స్టాక్ ధర నేడు ఇంట్రాడేలో దాదాపు 12 శాతం మేర క్షీణించి రూ.14 వద్ద కొనసాగుతోంది. వొడాఫోన్ ఐడియా తన బోర్డు జూన్ నాటికి ప్రమోటర్లు, ఇతర పెట్టుబడిదారుల నుంచి రూ.20,000 కోట్ల వరకు ఈక్విటీని సమీకరించడానికి ఆమోదించినట్లు తెలిపింది. దేశీయ టెలికాం ఆపరేటర్ ఇప్పటికే 5జీ సేవలను రోల్ అవుట్ చేయటంలో ఆలస్యం చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఇప్పటికే ఉన్న 4జీ సేవలను బలోపేతం చేయటం కోసం తాజాగా సేకరించే డబ్బును వినియోగించుకోనుంది.
పూర్తిగా అప్పుల్లో మునిగిపోయిన వోడాఫోన్ ఐడియా సంస్థలో భారత ప్రభుత్వం దాదాపు 33 శాతం ఈక్విటీ వాటాలను హోల్డ్ చేస్తోంది. అయితే తాజాగా ఈక్విటీతో పాటుగా రుణాల ద్వారా రూ.45,000 కోట్లను సమీకరించి సేవల్లో ప్రత్యర్థి కంపెనీలైన ఎయిర్ టెల్, జియోలతో పోటీ పడాలని కంపెనీ చూస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రూ.20 వేల కోట్ల నిధుల సమీకరణకు బోర్డు నుంచి అనుమతి లభించింది. ఈ క్రమంలో బయటి పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని బిలియనీర్ పారిశ్రామికవేత్త మరియు ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా గతవారం వెల్లడించారు.


Click it and Unblock the Notifications