Vodafone Idea: దేశీయ టెలికాం రంగంలో ప్రస్తుతం అతిపెద్ద పోటీ నడుస్తోంది. ఇక్కడ కేవలం టెక్నాలజీ, తగినన్ని నిధులు కలిగినవారిదే పై చేయిగా ఉంది. అయితే ఈ పోటీలో నలిగిపోయిన వొడాఫోన్ ఐడియా నుంచి కీలక ప్రకటన వచ్చింది.
తీవ్రమైన పోటీతో పెరుగుతున్న నష్టాలతో పాటు అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియాకు పెద్ద శుభవార్త ఉంది. కంపెనీ ప్రస్తుతం తన అవసరాల కోసం రూ.14,000 కోట్ల నిధులను పొందనుంది. ఈ మొత్తంలో సగం కంపెనీకి ఇప్పటికే ఉన్న ఇద్దరు ప్రమోటర్లు పెట్టుబడి పెట్టవచ్చని తెలుస్తోంది. కంపెనీ ప్రమోటర్లలో ఇండియాకు చెందిన ఆదిత్య బిర్లా గ్రూప్, UK ఆధారిత వోడాఫోన్ ఉన్నాయి.

అత్యంత ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో వ్యాపారం చేస్తున్నప్పటికీ కంపెనీ ప్రస్తుతం దేశంలో మూడవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ గా కొనసాగుతోంది. అయితే భారీ అప్పుల కారణంగా ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా మారిపోయింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు 5జీ సేవలను సైతం దేశంలో ప్రారంభించలేకపోయింది. సమాచారం ప్రకారం కంపెనీ ప్రభుత్వానికి ఒక ప్రణాళికను సమర్పించిందని తెలుస్తోంది. దీని ప్రకారం ప్రమోటర్లు ఇద్దరూ త్వరలో కంపెనీలో రూ.2,000 కోట్లు చొప్పున పెట్టుబడి పెట్టనున్నారని వెల్లడైంది. ఈ వార్తల నేపథ్యంలో స్టాక్ ఏకంగా 10 శాతం మేర లాభపడింది.
సెప్టెంబర్ 2021లో ప్రభుత్వం టెలికాం పునరుద్ధరణ ప్యాకేజీతో ముందుకు వచ్చింది. అప్పటి నుంచి ప్రమోటర్లు వోడాఫోన్ ఐడియాలో రూ.5,000 కోట్ల తాజా ఈక్విటీని పెట్టుబడి పెట్టారు. అలాగే వారు కంపెనీకి రూ.7,000 కోట్లను సమీకరించడంలో సహాయం చేస్తారు. కంపెనీలో ఆదిత్య బిర్లా గ్రూప్‌కు కంపెనీలో 18 శాతం వాటా ఉంది. అలాగే కంపెనీ మెుత్తం బ్యాంక్ రుణాలు రూ.40,000 కోట్ల నుంచి రూ.12,000 కోట్లకు తగ్గాయి. అంచనాల ప్రకారం 2026 నాటికి కంపెనీ రూ.25,000 కోట్ల నగదు కొరతను ఎదుర్కొంటుందని తెలుస్తోంది. ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం కంపెనీపై తన రూ.16,133 కోట్ల బకాయిలను ఈక్విటీగా మార్చింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications