ప్రముఖ టెల్కో వొడాఫోన్ ఐడియా ఈరోజు మధ్యాహ్నం కీలక ప్రకటన చేసింది. ఇది తమ నూతన బ్రాండ్ VIని ప్రకటించింది. ఈ రెండు బ్రాండ్స్‌ను కొత్త గుర్తింపును తీసుకు వస్తోంది. వొడాఫోన్, ఐడియాలు 2018 ఆగస్ట్ నెలలో కలిసిపోయాయి. నాలుగేళ్ల క్రితం జియో రావడంతో పోటీని తట్టుకోవడానికి కలిశాయి. ఆ తర్వాత ఏజీఆర్ బకాయిల అంశం, ప్రతి నెల కస్టమర్లు తగ్గిపోవడం వంటి ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కొంటోంది. ఇటీవలే ఏజీఆర్ బకాయిలపై సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.
బకాయిలను పదేళ్లలో తీర్చాలని ఆదేశించింది. ఉన్న మూడు టెల్కోల్లో జియో 2016లో వచ్చింది. ఎయిర్‌టెల్ మరో రూ.20,000 కోట్లు చెల్లించాలి. వొడాఫోన్ ఐడియా మాత్రం రూ.50వేల కోట్లకు పైగా చెల్లించాలి. ఈ నేపథ్యంలో ఇది చేతులెత్తేయడం ఖాయమని భావించారు.

సరికొత్త బ్రాండ్
మార్కెట్లో ఎన్నో సంశయాలు ఉండగా, మరోవైపు వొడాఫోన్ ఐడియా నిధుల సమీకరణపై దృష్టి సారించింది. అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వొడాఫోన్ ఐడియా ఈ రోజు కీలక ప్రకటన చేయనుందని వార్తలు రావడంతో పెట్టుబడులకు సంబంధించి అని అందరూ భావించారు. అయితే అందరూ ఊహించినట్లుగా కాకుండా, VI బ్రాండ్ పేరుతో మరో కీలక ప్రకటన చేసింది.

నిలదొక్కుకునే దిశగా.. పెట్టుబడులు, టారిఫ్ పెంపు
వొడాఫోన్ ఐడియా కొత్త బ్రాండ్‌ను ప్రకటించింది. అయితే నిధుల సమీకరణతో పాటు పోటీలో నిలదొక్కుకునే దిశలోనే ఈ ప్రకటన వచ్చిందని భావిస్తున్నారు. పెట్టుబడుల సమీకరణకు వొడాఫోన్ ఐడియా ప్రయత్నాలు సానుకూలంగా ఉండటం వల్లే కొత్త బ్రాండ్‌తో టెలికం రంగంలో యుద్ధానికి సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. ఎయిర్‌టెల్, జియోలకు ధీటుగా డిజిటల్ సేవల్లో పోటీ ఇవ్వాలని భావిస్తోంది. మరోవైపు, త్వరలో టారిఫ్ కూడా పెంచే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది. టారిఫ్స్ చాలా తక్కువగా ఉన్నాయని భారతీ ఎయిర్‌టెల్ కూడా పదేపదే చెబుతోంది. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా టారిఫ్స్ పెంచే అవకాశాలు ఉన్నాయి.

వొడాఫోన్ ఐడియా షేర్ జంప్
ఈ రోజు వొడాఫోన్ ఐడియా నుండి కీలక ప్రకటన రానుందనే వార్తల నేపథ్యంలో షేర్ ధర ఉదయం భారీగా పెరిగింది. పెట్టుబడుల గురించి ప్రకటన వస్తుందని భావించారు. దీంతో ఓ సమయంలో 13 శాతం లాభపడింది. ఆ తర్వాత బ్రాండ్ పేరుపై ప్రకటన చేయడంతో షేర్ ధర 2 శాతం కిందకు పడిపోయింది. ఆ తర్వాత టారిఫ్ పెంచుదామని ప్రకటన చేయడంతో మళ్లీ కాస్త పుంజుకుంది. అమెజాన్, వెరిజాన్‌లు కంపెనీలో 4 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications