ఏజీఆర్ బకాయిలపై సుప్రీం కోర్టు తీర్పు అనంతరం వొడాఫోన్ ఐడియా నిధుల వేటలో పడింది. వొడాఫోన్ ఐడియా రూ.50వేల కోట్లు చెల్లించాలి. ఈ మొత్తాన్ని వచ్చే మార్చి 31వ తేదీ నుండి విడతలవారీగా పదేళ్లలో తీర్చివేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ బకాయిలను ఎయిర్‌టెల్ చెల్లించగలుగుతుందని, వొడాఫోన్ ఐడియాకే ఇబ్బందికర పరిణామాలు అనే వాదనలు ఉన్నాయి. అయితే రెండు రోజులుగా నిధుల వేటలో పడటంతో కంపెనీ షేర్లు కూడా లాభాల్లోకి వెళ్తున్నాయి.

ఈక్విటీ షేర్లు
ఈక్విటీ షేర్లు లేదా ఇతర ఇన్‌స్ట్రుమెంట్స్ జారీ ద్వారా లేదా అర్హత కలిగిన సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్లు జారీ చేయడం ద్వారా ఇలా వివిధ పద్ధతుల్లో నిధులు సేకరించే అంశంపై సెప్టెంబర్ 4న జరగనున్న సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇండస్ టవర్‌లో వొడాఫోన్‌కు ఉన్న 11.5 శాతం వాటా వ్యాల్యూ రూ.4,040 కోట్లు. విలీన సంస్థకు రూ.2400 కోట్ల ముందస్తు చెల్లింపులు చేయాల్సి ఉంది. అంటే కంపెనీకు రూ.1600 కోట్ల వరకు నిధులు వస్తాయి. వొడాఫోన్ ఐడియా పదేళ్లలో రూ.50వేల కోట్లు చెల్లించాలంటే ఏడాదికి రూ.5000 కోట్లు.

వొడాఫోన్, ఐడియాపై అమెజాన్, వెరిజోన్ అండ
వొడాఫోన్ ఐడియాలో వెరిజాన్, అమెజాన్‌లు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. వొడాఫోన్ ఐడియాలో వాటా కొనుగోలుకి ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయట. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, అమెరికా వైర్‌లెస్ సేవల దిగ్గజం వెరిజాన్ కమ్యూనికేషన్స్ 4 బిలియన్ డాలర్లు (సుమారు రూ.29,000 కోట్లు) ఇన్వెస్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

షేర్ల దూకుడు
అమెజాన్, వెరిజాన్ పెట్టుబడులు పెట్టే యోచనలో ఉన్నాయని తెలియడంతో ఇటీవల వొడాఫోన్ ఐడియా కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మూడు రోజులుగా ఈ కంపెనీ షేర్లు ఎగిసిపడుతున్నాయి. ఈ రోజు ఏకంగా 29.80 శాతం లాభపడి రూ.12.85 వద్ద క్లోజ్ అయింది. అంతకుముందు సెషన్‌లో 11.86 శాతం లాభపడింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications