Vodafone Idea 5G: దేశంలో 5జీ విస్తరణకు మేజర్ టెలికాం కంపెనీలు విస్తృతంగా ప్రయత్నించటంతో పాటు కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇక్కడ ఉన్న పెద్ద సమస్య చాలా మంది వినియోగిస్తున్న 4జీ హ్యాండ్ సెట్స్. దీంతో ఇటీవల కాలంలో పెద్ద టెలికాం ఆపరేటర్లైన జియో, ఎయిర్ టెల్ కూడా తమ ఫోకస్ 5జీ విస్తరణ నుంచి 4జీని బలపరచటంపైకి మార్చేశాయి.
ఈ క్రమంలోనే చాపకింద నీరులా వొడాఫోన్ ఐడియా 5జీ లాంచ్ కోసం చురుకుగా ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. కంపెనీ మార్చి 2025 నాటికి దిల్లీ, ముంబై నగరాల్లో తొలుత 5జీ సేవలను లాంచ్ చేయాలని యోచిస్తోంది. జియో, ఎయిర్ టెల్ కంపెనీలకు పోటీగా ముందుగా మెట్రో నగరాలతో పాటు ప్రధాన పట్టణ ప్రాంతాలపై దృష్టి సారించి 17 ప్రాంతాలలో 5G సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జగ్బీర్ సింగ్ వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో యూజర్లు ఎక్కువగా 4జీ కనెక్టివిటీని వినియోగిస్తుండగా జూన్ 2024 నాటికి వొడఫోన్ ఐడియా 90 శాతం ప్రజలకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం వొడఫోన్ ఐడియా దేశంలోని 77 శాతం మందికి తన 4జీ సేవలను అందిస్తోంది. దీని ద్వారా ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలకు సేవలను చేరువచేసింది. ఈ క్రమంలో ప్రత్యర్థి ఆటగాళ్లకు బలమైన నెట్‌వర్క్ సేవలతో గట్టి పోటీ ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది. దాని పునరుద్ధరణ ప్రణాళికలో భాగంగా, ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్ నుంచి రూ.18,000 కోట్లతో సహా ఈక్విటీ ఫండింగ్ ద్వారా Vi రూ.24,000 కోట్లను సేకరించింది. ఈ డబ్బులో ఎక్కువ భాగం దాని 4G నెట్‌వర్క్‌ను మెరుగుపరచడానికి, 5G సేవలను ప్రారంభ మద్దతుకు ఉపయోగిస్తోంది. బిర్లాలు భాగస్వామం కలిగిన కంపెనీ జియో అరంగేట్రానికి ముందు మార్కెట్లో ఒక వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం కొనసాగుతున్న నెట్‌వర్క్ అప్‌గ్రేడ్ పనులు కొనసాగుతున్న వేళ ఇది పూర్తయితే Vi సబ్‌స్క్రైబర్‌లను కోల్పోవడం ఆగిపోతుందని సింగ్ నమ్మకంగా ఉన్నానన్నారు. పెరుగుతున్న డిమాండ్‌ను నిర్వహించడానికి తన 4G నెట్‌వర్క్‌ను విస్తరించడంపై దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో కంపెనీ ప్రత్యేకంగా 900 MHz బ్యాండ్‌పై దృష్టి సారించింది. ఇది మెరుగైన కవరేజీని అందిస్తుందని ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మెరుగైన కవరేజీ అందిస్తుందని కంపెనీ భావిస్తోంది. ఇదే క్రమంలో కంపెనీ తన టవర్ల సంఖ్యను 55 వేల నుంచి లక్షన్నరకు పెంచాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు 50 వేల కొత్త సైట్లు సిద్ధంగా ఉండగా, మరిన్న రానున్న కాలంలో సంసిద్ధం చేసే పనిలో కంపెనీ ఉంది. దీనికి తోడు ఇండస్ టవర్స్, ATC, టవర్ విజన్ వంటి ప్రధాన టవర్ ప్రొవైడర్‌లతో భాగస్వామ్యం కలిగిఉంది. అలాగే కంపెనీ ప్రస్తుతం చైనా నెట్ వర్క్ పరికరాలను రీప్లేస్ చేయాలని చూస్తోంది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications