ప్రస్తుత రోజుల్లో ఐటీ ఉద్యోగం లేదా రియల్ ఎస్టేట్ పెట్టుబడి అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే నగరాలు బెంగళూరు (Bengaluru), హైదరాబాద్ (Hyderabad) లేదా ముంబై(Mumbai). కానీ, రాబోయే ఐదేళ్లలో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోనుంది. భారతదేశంలోని ఒక టైర్-2 నగరం ఇప్పుడు గ్లోబల్ టెక్ దిగ్గజాలకు హాట్ ఫేవరెట్‌గా మారింది. అదే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నం (Vizag). ఇక్కడ రాబోతున్న పెట్టుబడులు చూస్తుంటే.. భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాల్లో , రియల్ ఎస్టేట్ వృద్ధిలో వైజాగ్ అగ్రస్థానంలో నిలవడం ఖాయమనిపిస్తోంది.

భారీ పెట్టుబడులు
విశాఖపట్నం నగర రూపురేఖలను మార్చడానికి గూగుల్ సంస్థ నడుం బిగించింది. 2030 నాటికి సుమారు 15 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 1.25 లక్షల కోట్లు) భారీ పెట్టుబడిని ఇక్కడ పెట్టేందుకు గూగుల్ ప్రణాళికలు సిద్ధం చేసింది. అదానీ , ఎయిర్‌టెల్ వంటి దేశీయ సంస్థలతో కలిసి ఇక్కడ అత్యాధునిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోంది. ముఖ్యంగా గూగుల్ తన 'ఏఐ డేటా సెంటర్' ను ఇక్కడే నిర్మించబోతోంది. దీని కోసం ప్రభుత్వం ఇప్పటికే 400 ఎకరాలకు పైగా భూమిని కేటాయించింది. అంతేకాకుండా, సముద్రం అడుగు భాగం నుండి డేటా కేబుల్స్ (Under-sea cables) నేరుగా విశాఖకే రానున్నాయి. ఇది నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో డేటా హబ్ గా మారుస్తుంది.
నయా ఐటీ హబ్‌గా వైజాగ్
కేవలం గూగుల్ మాత్రమే కాదు.. రిలయన్స్, అమెరికాకు చెందిన డిజిటల్ రియల్టీ సంస్థలు కలిసి 11 బిలియన్ డాలర్ల పెట్టుబడితో డేటా సెంటర్లను నిర్మిస్తున్నాయి. వీటితో పాటు మైక్రోసాఫ్ట్ సంస్థ కూడా భారత్‌లో ఏఐ డేటా సెంటర్ల కోసం 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించింది. ఇందులో ప్రధాన వాటా వైజాగ్‌కే దక్కే అవకాశం ఉంది. దాదాపు 100 కిలోమీటర్ల పరిధిలో "డేటా సిటీ" కాన్సెప్ట్‌తో ఇక్కడ భారీ ప్రాజెక్టులు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే 3 గిగావాట్ల డేటా కెపాసిటీకి సంబంధించిన ఒప్పందాలు పూర్తయ్యాయి. అంటే భవిష్యత్తులో టెక్నాలజీ ప్రపంచానికి విశాఖ కేంద్ర బిందువు కాబోతోంది.
మెట్రో నగరాల కంటే వైజాగ్ ఎందుకు బెటర్?
ప్రస్తుతం బెంగళూరు, గుర్గావ్, పుణె వంటి నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు, విపరీతమైన కాలుష్యం, ఆకాశాన్ని తాకుతున్న ఇంటి ధరలతో ఐటీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఐటీ కంపెనీలను టైర్-2 నగరాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నాయి. వైజాగ్ లో జీవన వ్యయం తక్కువగా ఉండటంతో పాటు, ఆహ్లాదకరమైన వాతావరణం, సముద్ర తీరం, మెరుగైన కనెక్టివిటీ ఉన్నాయి. ఇది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా మారుతోంది.
రియల్ ఎస్టేట్: సామాన్యుడికి గోల్డెన్ ఛాన్స్
పెట్టుబడిదారులకు ఇది నిజంగానే ఒక సువర్ణావకాశం. ప్రస్తుతం వైజాగ్ లో భూమి ధరలు బెంగళూరు, గుర్గావ్ ధరలతో పోలిస్తే కేవలం 40% మాత్రమే ఉన్నాయి. ముంబై లాంటి నగరాలతో పోలిస్తే ఇక్కడ ధరలు కేవలం 25% లోపే లభిస్తున్నాయి. అంటే మెట్రో నగరాల్లో ఒక చిన్న ఫ్లాట్ కొనే ధరతో వైజాగ్ లో పెద్ద ప్రాపర్టీని సొంతం చేసుకోవచ్చు. రాబోయే ఐదేళ్లలో ఇక్కడ మౌలిక సదుపాయాలు పెరిగే కొద్దీ, భూమి ధరలు ఊహించని రీతిలో పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఏదేమైనా గూగుల్, రిలయన్స్ వంటి బడా సంస్థలు ఒక నగరాన్ని నమ్మి వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నాయంటే.. అక్కడ ఖచ్చితంగా పెద్ద మార్పు రాబోతుందని అర్థం. ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తే, వైజాగ్ భారతదేశపు 'సిలికాన్ వ్యాలీ' గా ఎదిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే తెలివైన ఇన్వెస్టర్లు ఇప్పుడే విశాఖ వైపు దృష్టి సారిస్తున్నారు.
More From GoodReturns

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications