Glass Skywalk Bridge in Kailasagiri : ఏపీ ఆర్థిక నగరం విశాఖపట్నంలో గాజు వంతెన రెడీ అయింది. మరికొద్ది రోజుల్లో ఈ వంతెన పర్యాటకుల కోసం అందుబాటులోకి రానుంది. కైలాసగిరిపై 55 మీటర్లు పొడవు కలిగిన గాజు వంతెన నిర్మాణం మహా విశాఖ ప్రాంత నగరాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పూర్తయింది. ఈ గాజు వంతెన దేశంలోనే అతి పొడవైన వంతెనగా చెప్పవచ్చు. ఒకేసారి 100 మంది నిలబడే సామర్థ్యంతో ఈ గాజె వంతెనను నిర్మించారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఒకసారికి కేవలం 40 మందిని మాత్రమే అనుమతించనున్నారు. ఈ గాజు వంతెన నుంచి కిందకు చూస్తే విశాఖపట్నం నగరం మొత్తం కనిపిస్తుంది. గాల్లో తేలియాడుతున్నట్లుగా సరికొత్త అనుభూతిని అందిస్తుంది. ఎత్తైన కొండలు, లోయలు, కనుచూపు మేరలో సాగరంతో పర్యాటకులు మధురానుభూతిని కలిగిస్తుంది.
భారతదేశంలోనే అత్యంత పొడవైన గాజు వంతెనతో ఈ తూర్పు తీర నగరం త్వరలోనే టూరిజంలో సంచలనాలు నమోదు చేయనుంది. సముద్రం, కొండలు, పచ్చని ప్రకృతి.. అన్నింటితో అత్యంత అందంగా కనిపించే ఈ వినూత్న ప్రాజెక్ట్ సాహసప్రియులకు, ప్రకృతి అభిమానులకు మర్చిపోలేని అనుభవాన్ని అందించనుంది. ఈ స్కైవాక్ వంతెన కైలాసగిరి వద్ద ఉన్న టైటానిక్ వ్యూ పాయింట్ దగ్గర నిర్మించారు.

50 మీటర్ల పొడవుతో రూపుదిద్దుకోనున్న ఈ గాజు వంతెనపై నడవడం ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. కింద నుంచి అలలు ఎగసిపడుతుండగా, చుట్టూ విస్తరించి ఉన్న కొండల అందాలను ఆస్వాదించడం, గాజు మీద నడుస్తున్న ఉత్కంఠ కలగలిపిన ఆ అనుభవం పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకోనుంది.దాదాపు రూ. 6 కోట్ల అంచనా వ్యయంతో దీనిని నిర్మించారు. విశాఖలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి, సాహసక్రీడలను అభివృద్ధి చేయడానికి ఈ వంతెన ఒక ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (VMRDA), SSM షిప్పింగ్ & లాజిస్టిక్స్, భారత్ మాతా వెంచర్స్ కలిసి RJ అడ్వెంచర్స్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు ముందకు నడించింది.
ఈ వంతెన ఒకేసారి 40 మంది వరకు సౌకర్యవంతంగా నిలబడేలా ప్రత్యేకంగా రూపకల్పన చేశారు. భద్రతా ప్రమాణాలు కఠినంగా ఉంటాయి. కాబట్టి పర్యాటకులు భయపడి కాకుండా ఆనందంతో గాజు వంతెనపై నడుస్తూ... కింద ఉన్న సముద్రపు అలల శబ్దం, గాజు పారదర్శకత కలిపి ఒక అద్భుతమైన మానసిక అనుభూతిని పొందవచ్చు. ఈ ప్రాజెక్ట్‌లో అదనంగా రెండు జిప్-లైన్లు, స్కై-సైక్లింగ్ ట్రాక్‌లు కూడా రూపొందిస్తున్నారు. ఒక్కో జిప్‌లైన్ 150 మీటర్ల పొడవులో ఉండగా.. సందర్శకులు కొండలపైకి వేగంగా జారిపోతూ సరికొత్త థ్రిల్‌ను ఆస్వాదించవచ్చు. అదే సమయంలో స్కై-సైక్లింగ్ ద్వారా భూమి నుండి ఎత్తులో సైకిల్ తొక్కడం పర్యాటకులకు ఒక కొత్త సాహసాన్ని అందిస్తుంది. ఈ అదనపు వినోద ప్రాజెక్ట్‌ల కోసం మరో రూ. 2 కోట్ల వ్యయం కేటాయించారు.

విశాఖపట్నం స్కైవాక్ పూర్తయితే కేరళలోని వాగమోన్ గాజు బ్రిడ్జ్‌ను అధిగమించనుంది. ప్రస్తుతం వాగమోన్ 40 మీటర్ల కాంటిలివర్ గ్లాస్ బ్రిడ్జ్ టైటిల్‌ను కలిగి ఉంది. అయితే విశాఖలోని కొత్త వంతెన 50 మీటర్ల విస్తీర్ణంతో ఆ రికార్డును దాటబోతోంది. ఈ విధంగా ఇది జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఏపీకి గుర్తింపును తెచ్చే అవకాశముంది. విశాఖపట్నం ఎప్పుడూ పర్యాటకులకు ప్రత్యేకమైన ఆకర్షణలతో ప్రసిద్ధి చెందింది.
కైలాసగిరి కొండలు, సముద్రతీరాలు, సుందరమైన దృశ్యాలు ఈ నగరాన్ని ప్రత్యేకంగా మలిచాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన గాజు స్కైవాక్ వంతెన ఆ ఆకర్షణకు మరో కొత్త అనుభూతిని పర్యాటకులకు అందించనుంది. ఈ ప్రాజెక్ట్ వలన స్థానిక వ్యాపారాలు, హాస్పిటాలిటీ రంగం, రవాణా , పర్యాటక గైడ్ సేవలకు మంచి వృద్ధి అవకాశాలు కలిగే అవకాశం ఉంది.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications