Vivo S19 and Vivo S19 Pro: చైనాకు చెందిన టాప్ మొబైల్ ఫోన్ హ్యాండ్‌సెట్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ వివో.. కొత్తగా రెండు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. Vivo S19 and Vivo S19 Pro పేరుతో ఈ రెండింటిని తమ దేశ మార్కెట్‌లో వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రెండూ కూడా 5జీని సపోర్ట్ చేసేవే.
వివోలో ఎస్ సిరీస్ బాగా క్లిక్ అయిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా అదే సిరీస్‌లో తాజాగా రెండు మోడళ్లను విడుదల చేసింది. విడుదలైన కొద్దిసేపటికే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయవి. ఆన్ లైన్‌తో పాటు ఆఫ్ లైన్‌లో కూడా దీని అమ్మకాలు అందుబాటులో ఉంటోన్నాయి. ప్రస్తుతం చైనా మార్కెట్‌కు మాత్రమే పరిమితం. జూన్ నెలాఖరులోగా భారత్‌లోనూ ఈ రెండింటి విక్రయాలు మొదలు అవ్వొచ్చు.

వివో ఎస్ 19, వివో ఎస్ 19 ప్రొ డిస్‌ప్లే 6.78 అంగుళాల టచ్ స్క్రీన్‌ను కలిగిఉంటుంది. 1.5కే ఓఎల్ఈడీ స్క్రీన్లతో తయారు కావడం వీటి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. రీ-ఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్. వీవో ఎస్ 19 మోడల్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ఎస్ఓసీ ప్రాసెసర్‌తో తయారైంది. వీవో ఎస్ 19 ప్రొ మోడల్.. మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్లస్ చిప్ సెట్ తో రూపుదిద్దుకుంది.
ఈ రెండూ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ప్లాట్‌ఫామ్‌కు చెందినవే. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో పని చేస్తాయి. ఎస్ 19 మోడల్‌లో బ్యాక్ డిస్‌ప్లేలో 50 మెగాపిక్సెల్ ఓమ్నీ విజన్ కెమెరా ఉంటుంది. ఎస్ 19 ప్రో మోడల్‌లో 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 921 ప్రైమరీ సెన్సార్ కలిగి ఉంటుంది. ఈ రెండింట్లోనూ సెల్ఫీ కోసం 50 మెగాపిక్సెల్ కెమెరాలను అమర్చారు. వివొ ఎస్ 19 బ్యాటరీ సామర్థ్యం 6,000 ఎంఏహెచ్. కాగా- వివొ ఎస్ 19 ప్రొ మోడల్ బ్యాటరీ సామర్థ్యం 5,500 ఎంఏహెచ్. రెండు ఫోన్లకు కూడా 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.
మన దేశ కరెన్సీలో ఎస్ 19 మోడల్ 8 జీబీ ర్యామ్, 256 స్టోరేజీ ధర 28,800 రూపాయలు పలుకుతోంది. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ హ్యాండ్ సెట్ ధర 31,100 రూపాయలు. వివొ ఎస్ 19 ప్రొ మోడల్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ ధర 38,000 రూపాయలు. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ మోడల్ కావాలనుకుంటే 40,300 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications