Vivek Sharma: రూ.2.9 కోట్ల జాబ్ ఆఫర్ వదులుకోని కిరాణా షాప్.. తల్లిదండ్రులే ముఖ్యమన్న వివేక్ శర్న..!

సాధారణంగా ఐఐటీలో సీట్ వచ్చిందంటే లైఫ్ సెటిల్ అయిందని భావిస్తారు. ఐఐటీలో చదివితే జాబ్ ఖాయమని చెబుతారు. కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం వస్తుందని చెబుతారు. కొన్ని సందర్భాల్లో ఇది నిజమే.. ఐఐటీలో చదివే వారికి మంచి ఆఫర్ తో ఉద్యోగం వస్తుంది. ఇలానే ఐఐటీలో చదివిన ఓ విద్యార్థి భారీ ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడు. దాదాపు రూ.2.9 కోట్ల వార్షక వేతనంతో అతనికి ఉద్యోగం వచ్చింది. ఇంత జీతంతో ఆఫర్ వస్తే ఎవరైనా ఎగిరి గంతేసి వెళ్లిపోతారు. కానీ అతను మాత్రం ఆ భారీ ప్యాకేజీ ఉద్యోగాన్ని తిరస్కరించాడు. అతనే వివేక్ శర్మ. కాన్పూర్ కు చెందిన వివేక్ శర్మ ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాడు.

ఈ క్రమంలోనే అతనికి కోట్ల రూపాయల జీతంతో విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. అతనికి శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ రూ.2.9 కోట్ల వార్షిక వేతనంతో ఓ ఆఫర్ ఇచ్చింది. అయితే ఈ ఆఫర్ ను వివేక్ శర్మ తిరస్కరించారు. ఈ నిర్ణయం అందరిని ఆశ్చర్య పరిచింది. ఐఐటీ గోల్డ్ మెడలిస్ట్ అయిన అతను భారీ ఆఫర్ ను తిరస్కరించడంపై స్నేహితులు, బంధువులకు నచ్చలేదు. కానీ వివేక్ మాత్రం తను అనుకున్నదే చేశాడు. తన తల్లిదండ్రులను విడిచి ఎక్కడికి వెళ్లనని స్పష్టం చేశాడు. వివేక్ శర్మ కుటుంబం మధ్య తరగతి కుటుంబం. తండ్రి రైల్వే క్లర్క్ పని చేస్తుండగా.. తల్లి పిల్లలకు ట్యూషన్లు చెప్పే వారు.

Vivek Sharma

ఈ క్రమంలోనే కొడుకును బాగా చదివించాలనుచున్నారు. సంపాదించిన డబ్బంతా కొడుకు చదువుకే ఖర్చు పెట్టారు. కుమారుడు కూడా తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టాడు. ఐఐటీ బాంబేలో సీట్ సాధించారు. దీంతో అతని తల్లిదండ్రులు చాలా ఆనందపడ్డారు. ఐఐటీలో జాయిన్ అయి ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తర్వాత ఇంటర్వ్య్ లకు హాజరయ్యాడు. ఈ క్రమంలోనే అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ రూ.2.9 కోట్ల వార్షిక వేతనంతో ఓ ఆఫర్ వచ్చింది. దీంతో వివేక్, అతని తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. అయితే ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు.

అదే సమయంలో తండ్రికి గుండెపోటు వచ్చింది. మరో బాధకరమైన విషయం ఏమిటంటే.. తల్లి క్యాన్సర్ బారిన పడ్డారు. దీంతో వివేక్ సంకట స్థితిలో పడ్డాడు. చివరికి కనిపెంచిన అమ్మనాన్నను చూసుకోవడానికి మొగ్గు చూపాడు. భారీ ప్యాకేజీ ఆఫర్ ను తిరస్కరించాడు. ఇంటి వద్దే ఉంటూ అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులను వివేక్ చూసుకుంటున్నాడు. కుటుంబ పోషణ కోసం అతని కిరాణ షాప్ పెట్టాడు. తల్లిదండ్రులను చూసుకుంటూ షాపు నడిపిస్తున్నాడు. అంతే కాదు స్థానికంగా ఉన్న పిల్లలకు కోడింగ్ కూడా నేర్పిస్తున్నాడు వివేక్. వివేక్ పరిస్థితి, పేద పిల్లలకు కోడింగ్ నేర్పిస్తున్న విషయం తెలుసుకున్న అదే కంపెనీ.. కాన్పూర్ నుంచి రిమోట్ మోడ్ లో విద్య సంబంధిత ప్రాజెక్టులకు పని చేయాలని కోరింది. కంపెనీ ఆఫర్ ఓకే చెప్పిన అతను వర్క్ ఫ్రమ్ హోం చేస్తూ తల్లిదండ్రులను చూసుకుంటున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+