Vistex CEO: రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రమాదం.. సిల్వర్ జూబ్లీ ఫంక్షన్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీ CEO మృతి

Ramoji Filmcity: కంపెనీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఏకంగా ఆ సంస్థ CEOనే బలితీసుకుంది. క్షణకాలంలో జరిగిన ఈ దుర్ఘటనతో నిర్వాహకులు సహా సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ విషాద ఘటన తెలంగాణలోనే జరిగింది.

హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ప్రమాదంలో అమెరికాకు చెందిన సాఫ్ట్‌వేర్ సంస్థ విస్టెక్స్ CEO సంజయ్ షా ప్రాణాలు కోల్పోయారు. కంపెనీ సిల్వర్ జూబ్లీ కార్యక్రమంలో ఈ విషాదం చోటుచేసుకుంది. షా సహా ప్రెసిడెంట్ దాతల రాజు ప్రమాదంలో చిక్కుకున్నారు. వారిరువురికీ తీవ్ర గాయాలు కాగా.. వారిలో షా కన్నుమూశారు, మరో ఎగ్జిక్యూటివ్ పరిస్థితి విషమంగా ఉంది. 700 మంది ఉద్యోగుల సమక్షంలో ఈ దుర్ఘటన జరిగింది.

Vistex CEO died in company silver jubilee function at Ramoji Filmcity

సిల్వర్ జూబ్లీ కార్యక్రమంలో CEO సంజయ్ షా, ఛైర్మన్ దాతల రాజును లోహపు పంజరంలో నిలబెట్టి కొంత ఎత్తు నుంచి కిందకు దించే విధంగా నిర్వహాకులు ప్లాన్ చేశారు. ఆ సమయంలో అనుకోకుండా పంజరం లోహపు గొలుసు తెగిపోయింది. దీంతో వారిద్దరూ 15 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు నుంచి ఒక్కసారిగా కాంక్రీట్ వేదికపై పడిపోయారు.

విస్టెక్స్ వ్యవస్థాపకులు, CEO మరియు చీఫ్ ఆర్కిటెక్ట్ అయిన సంజయ్ షా ముంబైకి చెందిన వ్యక్తి. కంపెనీని స్థాపించి పరిశ్రమలో అగ్రగామిగా నిలపడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన నాయకత్వంలో విస్టెక్స్ గణనీయమైన వృద్ధిని సాధించింది. ఆరోగ్యం, విద్య, ప్రాథమిక అవసరాలపై దృష్టి సారించి విస్టెక్స్ ఫౌండేషన్ ద్వారా పలు ధార్మిక కార్యక్రమాలలోనూ షా చురుకుగా పాల్గొనేవారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+