Vistara విమానాలకు నేడే చివరి ప్రయాణం.. రతన్ టాటా మరణం తర్వాత..
Air India News: భారతీయ విమానయాన రంగంలో టాటాలు పెద్ద అడుగులు వేస్తున్నారు. ఎయిర్ ఇండియాను తిరిగి టాటా గ్రూప్ కొనుగోలు చేసిన తర్వాత తిరిగి దానికి పూర్వ వైభవం తీసుకురావటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే టాటాలు తమ ఇతర బ్రాండ్లను మెర్జర్ చేస్తున్న సంగతి తెలిసిందే. రతన్ టాటా మరణం తర్వాత చాలా కాలంగా కొనసాగుతున్న విస్తారా, ఎయిర్ ఇండియా మెర్జర్ చివరి దశకు చేరుకుంది. దీంతో రేపటి నుంచి విస్తారా బ్రాండ్ కనుమరుగు కానుందని తెలుస్తోంది.
ఈ క్రమంలో టాటాల జాయింట్ వెంచర్ అయిన ఫుల్ సర్వీస్ క్యారియర్ విస్తారా నేడు తన చివరి విమానాలను నడపనుంది. ప్రయాణికులను కంపెనీ విస్తారా బ్రాండ్ కింద్ గమ్యస్థానాలకు చేర్చటం నేటితో ముగియనుంది. రేపటి నుంచి విస్తారా సంస్థ కూడా ఎయిర్ ఇండియా బ్రాండ్ కింద కలిసిపోనుంది. మంగళవారం నుంచి భారత గగనలంలో టాటాలకు చెందిన ఎయిర్ ఇండియా మాత్రమే ఒక్కటిగా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లనుంది. వాస్తవానికి విస్తారా అనేది టాటా గ్రూప్ మరియూ సింగపూర్ ఎయిర్ లైన్స్ సంయుక్తంగా చేపట్టిన ప్రాజెక్ట్. మెర్జ్ అయిన తర్వాత కంపెనీలో సింగపూర్ ఎయిర్ లైన్స్ దాదాపు 25.1 శాతం వాటాను కలిగి ఉంది.

అలాగే గతవారంలో సింగపూర్ ఎయిర్ లైన్స్ విస్తారా మర్జర్ తర్వాత మరో రూ.3,195 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నట్లు పేర్కొంది. విలీనం తర్వాత మొదటి నెలలో విస్తారా టిక్కెట్‌లతో 115,000 కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఎయిర్ ఇండియా పేరుతో ప్రయాణించనున్నారని వెల్లడైంది. అయితే ప్రయాణికలకు ప్రస్తుతం విస్తారాలో అందిస్తున్న అదే ప్రయాణ అనుభవం కొనసాగుతుందని టాటా గ్రూప్ వెల్లడించింది. వాస్తవానికి జనవరి 2015లో విస్తారా ప్రారంభంలో.. ఈ జాయింట్ వెంచర్ కింద సింగపూర్ ఎయిర్‌లైన్స్ 49 శాతం, టాటా గ్రూప్ 51 శాతం కలిగి ఉన్నాయి.
పరివర్తనకు సహాయం చేయడానికి విమానాశ్రయాలలో హెల్ప్ డెస్క్ కియోస్క్‌లు ఏర్పాటు చేయబడనున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో సంకేతాలు మరియు సమాచారం ప్రయాణీకులను సరైన చెక్-ఇన్ డెస్క్‌లకు మార్గనిర్దేశం చేస్తాయి. అయితే విస్తారా కాంటాక్ట్ సెంటర్ కొనసాగింపును నిర్ధారించడానికి ఎయిర్ ఇండియా ప్రతినిధులకు కాల్‌లను దారి మళ్లిస్తుంది. ఇదే క్రమంలో విస్తారా లాయల్టీ మెంబర్స్ ఎయిర్ ఇండియా ప్రోగ్రామ్‌కు తరలించబడతారని ప్రయాణికులు గమనించాల్సి ఉంటుంది.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాం 2012లో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం విదేశీ విమానయాన సంస్థలను దేశీయ క్యారియర్‌లో 49% వరకు కొనుగోలు చేయడానికి అనుమతించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో జెట్ ఎయిర్‌వేస్ గల్ఫ్ క్యారియర్ ఎతిహాద్ నుండి 24% వాటాను పొందేందుకు, ఎయిర్ ఏషియా ఇండియా, విస్తారా ఆవిర్భావానికి దారితీసింది. భారతీయ గగనతలంలో గత దశాబ్దంలో కార్యకలాపాలు ప్రారంభించిన ఏకైక ఫుల్ సర్వీస్ క్యారియర్ విస్తారా. భారతీయ విమానయాన రంగంలో ప్రయాణంలో అనేక కంపెనీలు కాలగర్భంలో కలిసిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 25 ఏళ్లపాటు సేవలందించిన జెట్ ఎయిర్‌వేస్ ఆర్థిక సమస్యల కారణంగా ఏప్రిల్ 2019లో నిలిపివేయబడగా.. ప్రస్తుతం కోర్టు ఆదేశాల మేరకు లిక్విడేషన్‌కు సిద్ధంగా ఉంది.


Click it and Unblock the Notifications