Airline News: ప్రయాణంతో పాటు విస్తారా విందు.. టాటాల నయా ఆఫర్లు.. ప్రయాణికులకు పండగ..

Vistara Airlines: రాకేశ్ జున్‌జున్‌వాలా అరంగేట్రంతో విమానయాన రంగంలో పోటీ పెరిగిపోయింది. వివిధ మార్గాల్లో కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీలు తెగ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ప్రస్తుతం వసతులతో కంపెనీలు ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి. ఇందుకు విస్తారా నిదర్శనం. కంపెనీ దూర ప్రయాణాలు చేసేవారికి వెజ్, నాన్ వెజ్ ఆహారాన్ని అందిస్తున్నాయి. వీటిలో జాఫ్రానీ పులావ్, ముర్గ్ హండీ కోర్మా నుండి షాహీ తుక్డా, మట్కా కుల్ఫీ వరకు ఉంటాయి. వెటరన్ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలాకు చెందిన ఆకాశ ఎయిర్ ప్రయాణం ఆకాశంలో ప్రారంభమైన తరుణంలో కంపెనీ ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. Aakasa Air తన టిక్కెట్లను ప్రత్యర్థి కంపెనీల కంటే చాలా తక్కువ ధరలకు అందిస్తుంది.

లాభపడుతున్న వినియోగదారులు..

లాభపడుతున్న వినియోగదారులు..

విమానయాన సంస్థల మధ్య నెలకొన్న పోటీ కారణంగా ప్రస్తుతం విమాన ప్రయాణికులకు మేలు జరుగుతోంది. విస్తారా తన సుదూర విమానాల రెండవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. దీనిలో భాగంగా తన ప్రయాణికులకు ప్రత్యేక భోజనాన్ని అందించే పండుగను ప్రారంభించింది. దాని పేరు 'దావత్-ఎ-అవధ్'. ఇది ఆగస్టు 5 నుంచి ఆగస్టు 31 వరకు కొనసాగుతుంది. మన దేశం నుంచి ఫ్రాంక్‌ఫర్ట్, లండన్, ప్యారిస్‌లకు వెళ్లే వారికి అవధ్ అద్భుతమైన వంటకాలు అందుతున్నాయి.

2020లో ప్రయాణాలు ప్రారంభం..

2020లో ప్రయాణాలు ప్రారంభం..

టాటాలకు చెందిన విస్తారా సంస్థ తన సుదూర విమానాలను ఆగస్ట్ 2020లో ప్రారంభించింది. ఆ తర్వాత కంపెనీ మొదటి డైరెక్ట్ ఫ్లైట్ ఢిల్లీ నుంచి లండన్ హీత్రోకి బయలుదేరింది. ప్రస్తుతం కంపెనీ విదేశాల్లో వివిధ గమ్యస్థానాలకు నేరుగా విమానాలను నడుపుతోంది. వీటిలో బ్యాంకాక్, ఢాకా, దుబాయ్, ఫ్రాంక్‌ఫర్ట్, జెడ్డా, ఖాట్మండు, లండన్ హీత్రో, పారిస్, సింగపూర్ నగరాలు ఉన్నాయి.

విస్తారా విమానంలో ఏమి తినాలి?

విస్తారా విమానంలో ఏమి తినాలి?

విస్తారా ప్రత్యేక మెనూలో అనేక రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ వంటకాలు ఉన్నాయి. వీటిలో జాఫ్రానీ పులావ్, దమ్ కా పనీర్, ముర్గ్ హండీ కోర్మా, ఆలూ బుఖారా కోఫ్తా, ఖమీరీ రోటీతో కూడిన ఆచారి ముర్గ్ ఖుర్చన్ ఉన్నాయి. ఇది కాకుండా వివిధ రకాల స్వీట్లను కూడా అందిస్తోంది. ప్రయాణికులు షాహీ తుక్డా, మట్కా కుల్ఫీ వంటి రుచికరమైన వంటకాలను తప్పక తినాల్సిందే.

కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు..

కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు..

మనదేశంలో విమానయాన రంగం అత్యంత పోటీ కలిగిన రంగం. ఇక్కడ ఇప్పటికే ధరల యుద్ధం కొనసాగుతోంది. ప్రస్తుతం ఇండిగో ఈ రంగాన్ని శాసిస్తోంది. ప్రస్తుతం టాటా, ఆకాశ ఎయిర్ లైన్స్ అరంగేట్రంతో ధరల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. ఆఫర్ల వర్షం కురిపించేందుకు కంపెనీలు బాగా కసరత్తు చేస్తున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+