Vistara offer: కనీసం ఒక్కసారైనా విమానం ఎక్కాలని కోరుకునే వారు ఎందరో ఉంటారు. సగటు మధ్యతరగతి వ్యక్తికి అదొక కల. అయితే ఆ కలను నిజం చేసుకునే అవకాశం వచ్చింది. కేవలం బస్సు టికెట్ ధరకే విమాన ప్రయాణ చేసే అవకాశం వచ్చింది. ఇందుకు రెండు రోజులు మాత్రమే అవకాశం ఉంది. కుదిరితే ఈ ఆఫర్‌ను మీరూ వినియోగించుకోండి.
టాటా గ్రూపులో భాగమైన విస్తారా ఫుల్-సర్వీస్ క్యారియర్ ఈ పరిమిత కాలపు ఆఫర్ ప్రకటించింది. 'విస్తారా మాన్ సూన్ సేల్' పేరిట దేశీయ, అంతర్జాతీయ రూట్లకు ఇది వర్తించనున్నట్లు తెలిపింది. ఇండియాలో ప్రయాణానికి 1,499 మరియు విదేశాలకు 11,799 చొప్పున ప్రారంభ రేట్లుగా నిర్ణయించింది. ఈ సేల్ ప్రయోజనాలు ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్ క్లాస్లకు అందుబాటులో ఉన్నాయి.

జూలై 2023 నుంచి మార్చి 2024 మధ్య ప్రయాణానికి ఈ సేల్ అందుబాటులో ఉంది. "మాన్ సూన్ సేల్ ద్వారా మీ ప్రయాణ కలను నిజం చేసుకోండి. మా దేశీయ, అంతర్జాతీయ రూట్లలో తగ్గింపు ధరలను ఆస్వాదించండి. మార్చి 23, 2024లోపు ప్రయాణానికి గాను జూలై 4, 2023లోగా మీ టికెట్స్ బుక్ చేసుకోండి" అని విస్తారా ట్వీట్ చేసింది.
దేశీయ మార్గాల్లో వన్-వే ఎకానమీ ఛార్జీలు 1,499, ప్రీమియం ఎకానమీకి 1,999 మరియు బిజినెస్ క్లాస్‌కు 9999 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సేల్ కింద జూలై 4 అర్థరాత్రి 23:59 వరకు బుకింగ్స్ కొనసాగనున్నాయి. ఆసక్తిగల ప్రయాణికులు అధికారిక వెబ్‌సైట్ www.airvistara.com, iOS, Android మొబైల్ యాప్‌ల ద్వారా టిక్కెట్స్ కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications