IPO News: లిస్ట్ కాగానే ఐపీవో అప్పర్ సర్క్యూట్.. తొలిరోజే ఆనందంలో ఇన్వెస్టర్లు..
IPO News: ఈరోజు మార్కెట్లోకి రియర్టీ రంగానికి చెందిన రెండు ఐపీవోలు అడుగుపెట్టాయి. ఇవి ఇన్వెస్టర్లకు మంచి రాబడులను తొలిరోజే అందించి ఊహించని రీతిలో లాభాలను తెచ్చిపెట్టాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది విష్ణుసూర్య ప్రాజెక్ట్స్ అండ్ ఇన్‌ఫ్రా ఐపీవో గురించే. మార్కెట్ లిస్టింగ్ సమయంలో ఐపీవో పెద్దగా లాభాలను నమోదు చేయలేదు. ఎన్ఎస్ఈలో రూ.73 రేటు వద్ద అడుగుపెట్టింది. ఇది కంపెనీ ఇష్యూ రేటు రూ.68 కంటే కేవలం 7.4% అధికం. అయితే జాబితా అయిన కొద్దిసేపటికే స్టాక్ అప్పర్ సర్క్యూట్‌ను తాకడంతో షేర్ ధర గరిష్ఠంగా రూ.76.65కి చేరుకుంది.

విష్ణుసూర్య కంపెనీ తన ఐపీవో కోసం లాట్ పరిమాణానని 2000 షేర్లుగా నిర్ణయించింది. IPO సబ్‌స్క్రిప్షన్ కోసంసెప్టెంబర్ 29న ప్రారంభించబడి అక్టోబర్ 5న ముగిసింది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ మార్కెట్ల నుంచి రూ.49.98 కోట్లను సమీకరించింది. దీనికోసం 73,50,000 తాజా ఈక్విటీ షేర్లను కంపెనీ విక్రయించింది. భవానీ జైప్రకాష్ కంపెనీకి ప్రమోటర్‌గా ఉన్నారు. ఐపీవో నుంచి సేకరించిన మెుత్తాన్ని కంపెనీ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, రుణాల చెల్లింపులతో పాటు సాధారణ కార్పొరేట్ ప్రయోజనాలకు వినియోగించాలని నిర్ణయించింది.
వ్యాపారం విషయానికి వస్తే కంపెనీ 1996లో స్థాపించబడింది. ఈ కంపెనీ రాళ్లను తవ్వడం, క్రషింగ్ ప్లాంట్లు, ఇసుక వాషింగ్ ప్లాంట్‌లను ఉపయోగించడం ద్వారా కంకర, ఇసుక తయారీలో వ్యాపారంలో ఉంది. కంపెనీ ప్రాపర్టీ డెవలప్‌మెంట్, కమర్షియల్ అండ్ మిక్స్‌డ్ డెవలప్‌మెంట్ కన్‌స్ట్రక్షన్, IT, ఇనిస్టిట్యూషనల్ స్పేస్, రిటైల్ (మాల్స్), ఆఫీసులు, ఇండస్ట్రియల్ పార్కులు, రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లు వంటి రియాల్టీ పరిశ్రమలో విభిన్న సామర్థ్యాలను కలిగి ఉంది. అలాగే.. లగ్జరీ విల్లాలు, రిసార్ట్‌లు, ఫ్యాక్టరీలు, గిడ్డంగులు, స్టేడియంలు, ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్‌లు, పారిశ్రామిక బ్రౌన్‌ఫీల్డ్ అభివృద్ధి ప్రాజెక్టులను చేపడుతోంది.


Click it and Unblock the Notifications