శారీరక వైకల్యం, ఆర్థిక పరిస్థితులు కూడా అతని విజయాన్ని ఆపలేకపోయింది. డిగ్రీని పక్కన పెట్టి, ఉద్యోగాలకు దూరంగా ఉంటూ
రాబోయే కాలం స్టోర్లు, సూపర్ మార్కెట్లదేనని గ్రహించాడు. రేషన్ నుండి బట్టలు, కూరగాయలు ఒకటేంటి అన్నీ ఒకే చోట దొరికే రోజులు వస్తాయని ముందే పసిగట్టాడు. ఈ ఆలోచనతోనే ఒక చిన్న ఫోటో షాపు నుండి భారతదేశంలో రిటైల్ స్టోర్ విప్లవానికి పునాది వేసిన 'విశాల్ మెగా మార్ట్'ను ప్రారంభించాడు. అతను ఎవరో కాదు రామ్ చంద్ర అగర్వాల్. కొద్దీ రోజులుగా విశాల్ మెగా మార్ట్ సెక్యూరిటీ గార్డు ఉద్యోగ ప్రకటనకి సంబంధించిన అర్హతలు, పరీక్షల పై సోషల్ మీడియాలో మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

పోలియో అడ్డుకోని పట్టుదలతో: కోల్‌కతాలోని ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన రామ్ చంద్ర అగర్వాల్ నాలుగేళ్ల వయసులో పోలియో బారిన పడ్డాడు. అతని శరీరంలోని ఒక కాలు పనిచేయడం మానేసింది, నడకకు చెక్క కర్రలే ఆధారంగా మారాయి. కానీ రామచంద్ర ఓటమిని అంగీకరించే మనస్తత్వం కాదు. చదువు పూర్తి చేసినా 9 నుండి 5 గంటల ఉద్యోగం తనతో కాదని తెలుసుకున్నాడు. దింతో అప్పుగా తీసుకున్న డబ్బుతో కోల్‌కతాలో ఒక చిన్న ఫోటో స్టూడియో షాపు ప్రారంభించాడు.
వ్యాపారంలో కొత్త అడుగులు: ఒక సంవత్సరం పాటు ఫోటో స్టూడియో నడిపినా అది అతనికి సంతృప్తి ఇవ్వలేదు. కూల్ డ్రింక్స్ అమ్మాడు కానీ పెద్దగా లాభాలు రాలేదు. అప్పుడు అతని దృష్టి ఫాబ్రిక్ వ్యాపారం వైపు మళ్లింది. కోల్‌కతాలో చిన్న బట్టల వ్యాపారం ప్రారంభించాడు. దాదాపు 15 సంవత్సరాలు బట్టల వ్యాపారం చేసినా అతని మనసు ఏదైన పెద్దగా చేయాలని కోరుకునేది. అందుకే, అన్నింటినీ వదిలేసి ఢిల్లీకి వచ్చాడు.
విశాల్ మెగా మార్ట్ ప్రారంభం : 2001-02 సంవత్సరంలో రామ్ చంద్ర అగర్వాల్ ఢిల్లీ నుండి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన విశాల్ మెగా మార్ట్ను ప్రారంభించాడు. దేశంలోని మధ్యతరగతి, పేద ప్రజలే లక్ష్యంగా ఒక కొత్త స్టోర్ సృష్టించాడు. కేవలం రూ.99కే నిత్యావసర వస్తువులు, బట్టలు అమ్మడం ద్వారా విశాల్ మెగా మార్ట్ ప్రజల హృదయాల్లో మంచి స్థానం సంపాదించుకుంది.
దింతో విశాల్ మార్ట్ వేగంగా విస్తరించింది. 414 నగరాల్లో 645 స్టోర్లు, 2,50,000 చదరపు అడుగుల రిటైల్ స్థలం, ఐదు గోడౌన్లు విశాల్ మార్టును రోజురోజుకు ముందుకు నడిపించాయి. 2007లో కంపెనీ రూ.2000 కోట్ల విలువైన IPOను ప్రారంభించింది. స్టాక్ మార్కెట్‌లో కూడా విశాల్ మెగా మార్ట్ పేరు చేరింది.
తొందరపాటుతో దెబ్బతిన్న సామ్రాజ్యం: అయితే వేగంగా అభివృద్ధి చెందాలనే పోటీ, తొందరపాటుతో తీసుకున్న తప్పుడు నిర్ణయాలు విశాల్ మెగా మార్ట్‌ను నష్టాల్లోకి నెట్టాయి. ఎటువంటి అంచనా లేకుండానే స్టోర్లు, గోడౌన్లు తెరవడం వల్ల కంపెనీపై అప్పుల భారం పెరిగింది. దానికి తోడు 2008 ఆర్థిక మాంద్యం కంపెనీని తీవ్రంగా దెబ్బతీసింది. స్టాక్ మార్కెట్‌లో వచ్చిన ప్రకంపనలను విశాల్ మెగా మార్ట్‌కు భారీ నష్టాలను కలిగించింది. దింతో కంపెనీపై అప్పుల భారం రూ.750 కోట్లకు చేరుకుంది.
భారీ నష్టంతో అమ్మకానికి :2011లో విశాల్ మెగా మార్ట్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. రూ.750 కోట్లకు పైగా అప్పులు పేరుకుపోయాయి. బ్యాంకులకు, అప్పు ఇచ్చినవాళ్ళకి కట్టడానికి కూడా డబ్బు కొరత ఏర్పడింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో విశాల్ మెగా మార్ట్‌ను కాపాడటానికి అగర్వాల్ కంపెనీని అమ్మాలని నిర్ణయించుకున్నాడు. రూ.1100 కోట్ల విలువైన కంపెనీని కేవలం రూ.70 కోట్లకే శ్రీరామ్ గ్రూప్ అండ్ టిపిజి క్యాపిటల్‌కు అమ్మసాడు. 2018 సంవత్సరంలో కేదార క్యాపిటల్ అండ్ పార్టనర్ గ్రూప్ విశాల్ మెగా మార్ట్‌ను సుమారు 3వేల కోట్లకు కొనుగోలు చేశాయి.
రామచంద్ర అగర్వాల్ విశాల్ మార్ట్ కంపెనీని ఎంతో ఇష్టపడ్డాడు కానీ అతనే విశాల్ మెగా మార్ట్‌ను చివరికి అమ్మేశాడు. అయితే మిగిలిన డబ్బుతో కొత్త కంపెనీని ప్రారంభించేందుకు 10 కోట్లు అప్పుగా తీసుకుని అతను V2 మార్ట్ అనే రిటైల్ సూపర్ మార్కెట్‌ను ప్రారంభించాడు.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..



Click it and Unblock the Notifications