Visakhapatnam Real Estate News: భారతదేశంలో టైర్ 2 నగరాల్లో రియల్ ఎస్టేట్ భారీగా పడిపోయింది. ప్రధాన నగరాల కంటే ఈ నగరాల్లో రియల్ బూమ్ నేల చూపులు చూస్తోంది. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో అమ్మకాలు 8 శాతం మేర తగ్గాయి. అయితే అమ్మకాలు తగ్గినా వాటి విలువ మాత్రం ఆరు శాతం పెరిగింది. అంటే తక్కువ ఇళ్లు అమ్ముడైనా, ఎక్కువ ధరలకు ఆ ఇల్లు అమ్ముడపోయాయి. ప్రముఖ రియల్ ఎస్టేట్ డేటా సంస్థ ప్రాప్‌ఈక్విటీ నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 15 టైర్-2 నగరాల్లో 2025 Q1లో మొత్తం 43,781 ఇళ్లు అమ్ముడయ్యాయి. ఇది గతేడాది ఇదే కాలంలో అమ్ముడైన 47,378 ఇళ్ల కంటే 8 శాతం తక్కువ.అయితే, అమ్మకాల విలువ మాత్రం రూ. 38,102 కోట్ల నుంచి రూ. 40,443 కోట్లకు పెరిగి, 6 శాతం వృద్ధి చూపించింది.
ఈ నేపథ్యంలోనే టైర్ 2 నగరం విశాఖలో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చెందిన నగరంగా దూసుకుపోతున్న వైజాగ్ లో భూముల ధరలు ఎలా ఉన్నాయి. పెట్టుబడికి అనుకూలంగా ఉన్నాయా.. ఇప్పుడ పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయా అనే దానిని ఓ సారి మనం చూసుకున్నట్లయితే.. విశాఖలో ప్రస్తుతం మౌలిక సదుపాయాల విస్తరణ, పరిశ్రమల ప్రోత్సాహం, ఐటీ రంగానికి ఆహ్వానం వంటి చర్యలతో దూసుకుపోతోంది. ఈ అభివృద్ధి అక్కడ రియల్ ఎస్టేట్ రంగంలో భూముల ధరలను క్రమంగా పెంచుతోంది, రియాల్టీ నిపుణులు అభిప్రాయం ప్రకారం.. కొన్ని ప్రాంతాల్లో పెట్టుబడి పెడితే భవిష్యత్తులో బంగారం లాంటి రాబడి పొందవచ్చని చెబుతున్నారు.

విశాఖలో ప్రస్తుతం పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలను ఓ సారి మనం చూసుకున్నట్లయితే.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పరిధిలోని ప్రాంతాలైన ఆనందపురం, తగరపువలస ప్రాంతాల్లో భవిష్యత్తులో భూముల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఐటీ కేంద్రం మధురవాడలో ఐటీ రంగం ఊపందుకుంటున్నందున దీని సమీప ప్రాంతాలు కూడా పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నాయి. మధురవాడకు సమీపంలో ఉన్న యెండాడలో కూడా భవిష్యత్తులో భూముల ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఇక పారిశ్రామిక కేంద్రాలు గాజువాక & కూర్మన్నపాలెంలో కూడా భూముల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగవకాశాలు ఎక్కువగా ఉన్నందున నివాస స్థలాలకు డిమాండ్ నెలకొంది.
నగర జీవనానికి దూరంగా ప్రశాతంగా బతకాలనుకునే వారికి పెందుర్తి & సబ్బవరం, కొత్తవలస, బీచ్ రోడ్, రుషికొండ వంటి ప్రాంతాలు అనుకూలంగా ఉన్నాయి. వైజాగ్ భవిష్యత్తులో పుంజుకుంటే ఈ ప్రాంతాల్లో కూడా రియల్ఎస్టేట్ పీక్ స్టేజ్ కి వెళ్లే అవకాశం ఉంది. ఇక ఆనందపురంలో కూడా భూముల ధరలకు రెక్కలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఈ ప్రాంతం ఐటీ హబ్ మధురవాడ, భోగాపురం విమానాశ్రయానికి మధ్యలో ఉంది.
అయితే ఇన్వెస్టర్లు ఈ ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టే ముందు రహదారులు, నీటి సరఫరా, విద్యుత్, రవాణా సౌకర్యాలు వంటి మౌలిక సదుపాయాల స్థితిని పరిశీలించడం అత్యవసరం అని నిపుణులు చెబుతున్నారు. విశాఖ అన్ని రాష్ట్రాల ప్రజలను అక్కున చేర్చుకునే నగరం. అయితే ఎక్కువగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు ప్రాంతాల వ్యాపారులు మాత్రం ఇక్కడ బలంగా పాతుకుపోయి ఉన్నారు.
గత ప్రభుత్వంలో మూడు రాజధానుల చర్చలో విశాఖ పేరు రాగానే రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒకసారి ఊపందుకుంది. అయితే ప్రస్తుతం పరిస్థితి వేరుగా ఉంది. భూములు, ప్లాట్లు కొద్దిగా ఎక్కువ-తక్కువ రేట్లలో అమ్ముడవుతున్నాయి. రియల్ బూమ్ కి ఎటువంటి ఢోకా లేదు. అయితే అప్పటి ధరలకే ఇప్పుడు కూడా చాలామంది అమ్మాలని ప్రయత్నిస్తుండటంతో కొనుగోలుదారులు అక్కడ స్థలాలు కొనేందుకు వెనుకంజ వేస్తున్నారు. కొంత రాయితీ ఇస్తే మాత్రం డీల్స్ క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్, ఐటి విస్తరణ, పర్యాటక ప్రాజెక్టులు ప్రారంభమైతే, ధరలు మాత్రం నింగిని తాకే అవకాశం ఉంది.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
More From GoodReturns

Gold rates: బంగారం ధరలకు మళ్ళీ రెక్కలు! తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలివే..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications