Olympics News: వీసా స్టార్టప్ CEO మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా స్వర్ణం గెలిస్తే..
Neeraj Chopra: దేశం తరపున వెళ్లిన ఆటగాళ్లు ఏదైనా సాధించినప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారిని గౌరవిస్తుంటాయి. అవార్డులు, రివార్డులతో పాటు నగదు మరియు ఉద్యోగాలను కూడా ఆఫర్ చేస్తుండటం వింటూనే ఉన్నాం. వీటికి అదనంగా పలువురు పారిశ్రామిక దిగ్గజాలు కూడా కాస్ట్లీ గిఫ్టులు ఇచ్చి తమవంతుగా ప్రోత్సాహం అందిస్తుంటారు. తాజాగా ఇలాంటిదే ఓ బంపర్ ఆఫర్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
భారత సంతతికి చెందిన వీసా స్టార్టప్ అట్లీస్(Atlys) CEO మోహక్ నహ్తా కీలక ప్రకటన చేశారు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా స్వర్ణం గెలిస్తే తన వినియోగదారులు 'అందరికీ ఉచిత వీసా' ఇస్తానని వెల్లడించారు. అందరం కలిసి భారత్ వెళ్దామని ఆహ్వానించారు. దీనిపై సోషల్ మీడియా వినియోగదారులు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు CEOకు పలు సూచనలు సైతం చేస్తున్నారు.

'నీరజ్ చోప్రా స్వర్ణం గెలిస్తే అందరికీ ఉచిత వీసా ఇస్తామని జూలై 30న వాగ్దానం చేశాను. ఆగస్ట్ 8న పతకాల కోసం పోటీ జరుగుతుంది. అందులో అతడు గోల్డ్ మెడల్ సాధించినట్లయితే, మేము ఒక రోజు మొత్తం వినియోగదారులందరికీ ఉచిత వీసాను అందిస్తాము' అని తన ప్రకటనపై మరికొంత స్పష్టత ఇచ్చారు. వినియోగదారులు 0 ఖర్చుతో ఈ ఆఫర్ పొందుతారు. ఇది అన్ని దేశాలను కవర్ చేస్తుంది అని వివరించారు.
గో ఇండియా, కేవలం ఒక్క స్వర్ణంతో సరిపెట్టుకోవద్దని లింక్డ్ ఇన్ యూజర్స్ కామెంట్స్ చేస్తున్నారు. మోహక్ చొరవతో నీరజ్ మరియు ఒలింపిక్స్ అభిమానులకు మరింత ప్రోత్సహం కలిగినట్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. కేవలం స్వర్ణంతో సరిపెట్టుకోకుండా తన సొంత రికార్డును సైతం అధిగమిస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భారతీయులుగా గర్విస్తున్నట్లు పేర్కొంటున్నారు.
ఇక అట్లీస్ కంపెనీ 2020లో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో స్థాపించబడింది. USతో పాటు భారత్‌లోని ముంబై మరియు గురుగ్రామ్‌లలో దీనికి కార్యాలయాలు ఉన్నాయి. పలు దేశాల వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వినియోగదారులకు ఈ కంపెనీ సేవలు అందిస్తుంటుంది. కాగా ఇప్పుడు ఈ కీలక ఆఫర్ ప్రకటించింది.


Click it and Unblock the Notifications