ఇప్పటివరకు అమెరికా టూరిస్ట్ వీసా పొందడం కొంత సులభంగా ఉండేది. తగిన డాక్యుమెంట్లు ఇచ్చి, ఇంటర్వ్యూకు హాజరైపోతే సరిపోయేది. కానీ తాజాగా అమెరికా తీసుకున్న కొన్ని కొత్త నిబంధనలతో ఈ ప్రాసెస్ కాస్త కఠినంగా మారబోతుందని అనిపిస్తోంది. ఇటీవలే అమెరికా ప్రభుత్వం కొన్ని దేశాల టూరిస్ట్ మరియు బిజినెస్ వీసా దారుల కోసం "వీసా బాండ్ పైలట్ ప్రోగ్రామ్" అనే ప్రత్యేక విధానాన్ని ప్రవేశపెట్టింది.

ఎందుకు ఈ బాండ్ పాలసీ?
కొన్ని దేశాల నుంచి అమెరికా వెళ్లే టూరిస్టులు అక్కడ వారి గడువు ముగిసినా, తిరిగి తమ దేశాలకు వెళ్లకుండా అక్కడే ఉండిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతోనే అమెరికా ప్రభుత్వం "వీసా బాండ్" అనే కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఇది ఒక 12 నెలల ప్రయోగ ప్రాజెక్ట్ ఆగస్టు 20న మొదలవుతుంది.
ఈ బాండ్ అమలులో ఉన్న వారికి మీరు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తే, అంటే వీసా గడువు పూర్తయిన వెంటనే తిరిగి వెళ్లిపోతే మీరు ముందుగా ఇచ్చిన బాండ్ మొత్తం మళ్లీ మీకు తిరిగివస్తుంది. కానీ మీరు నిబంధనలను అతిక్రమిస్తే ఆ డబ్బు మళ్లీ ఇవ్వరు.
ఈ బాండ్ విధానం అందరికీ వర్తించదు. ఇది కొన్ని నిర్దిష్ట దేశాలకే పరిమితం. అమెరికా ప్రభుత్వం ఓవర్‌స్టే ఎక్కువగా చేస్తున్న దేశాల పౌరుల కోసం మాత్రమే ఈ నిబంధనను వర్తింపజేస్తోంది. ఇందులో భారత్ కూడా ఉంటుందా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఒకవేళ భారత్ ఆ జాబితాలో ఉంటే, అమెరికా వెళ్లాలంటే, వీసా అప్లై చేసే సమయంలోనే భద్రతా డబ్బు (బాండ్) చెల్లించాలి అనేది కొత్త నిబంధన కావొచ్చు. కానీ వారు వీసా కాలాన్ని మించి ఎక్కువగా ఉంటె ఈ బాండ్ డబ్బు ప్రభుత్వానికి వెళ్తుంది.
అమెరికా టూరిస్ట్ వీసా కోసం ముందుగా దాదాపు రూ 4 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు చెల్లించాల్సి రావచ్చు. ఇది $5,000 నుంచి $15,000 వరకు ఉండొచ్చు. మీరు ఏ దేశానికి చెందినవారో, మీ వ్యక్తిగత పరిస్థితి ఏంటి అనే అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది. ఇది ఒక భద్రతా డిపాజిట్ లాంటిది అయినా, ఇది బ్యాంక్‌లో జమ చేసే డిపాజిట్ కాదు. మీరు ఈ డబ్బును Pay.gov అనే అధికారిక వెబ్‌సైట్ ద్వారా నేరుగా అమెరికా ప్రభుత్వానికి చెల్లించాలి.
ఈ పథకం ఎలా పనిచేస్తుంది?
వీసా బాండ్ ఇచ్చిన వారు వీసా కాలం పూర్తయ్యాక సమయానికి అమెరికా వదిలిపడితే, వారు డబ్బును పూర్తిగా తిరిగి పొందొచ్చు. కొద్దిగా కూడా కాలం మించి ఉంటే, మొత్తం డబ్బును ఫిర్యాదు చేసే అవకాశం లేదు.
మారిన కొన్ని కీలక విషయాలు:
ఇప్పటివరకు, కొన్ని సందర్భాల్లో ముందు వీసా తీసుకున్నవారికి ఇంటర్వ్యూ మినహాయింపు ఉండేది. ఇప్పుడు ఫేస్‌టు-ఫేస్ ఇంటర్వ్యూ తప్పనిసరిగా ఉండేలా మార్పులు చేపట్టారు.
వీసా ఫీజు అదనంగా: ఇకపై వీసా అప్లై చేసే సమయంలో, సాధారణ ఫీజుతో పాటు "వీసా ఇంటెగ్రిటీ ఫీజు" పేరుతో $250 (దాదాపు రూ. 20,000) అదనంగా చెల్లించాల్సి రావొచ్చు.
ఈ విధంగా, కొత్త అమెరికా వీసా బాండ్ పథకం వల్ల కొన్ని దేశాల వారు బి-1, బి-2 వీసా కోసం దరఖాస్తు చేసే సమయంలో అధిక మొత్తంలో గ్యారంటీ డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. వీసా షరతులు కట్టుబడి ఉంటే బాండ్ డబ్బు తిరిగి వస్తుంది, లేనప్పుడు ప్రభుత్వానికి జమ అవుతుంది. ఇది అమెరికా వీసా నిబంధనలు కాస్త కఠినంగా మార్చింది... ఇప్పుడు నియమాలు మరింత గట్టిగా అమలవుతున్నాయి.
More From GoodReturns

Oil prices: జపాన్ రహస్య ఆయిల్ నిధి! ఆరు నెలలకు సరిపడా చమురుని జపాన్ ఎలా దాచిపెట్టింది?

యుద్దం ఆపడం మా చేతుల్లో ఉంది.. నీ చేతుల్లో కాదు.. ట్రంప్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ విసిరిన ఇరాన్..

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే అంచనాలు.. తగ్గిన ముడి చమురు ధరలు.. ట్రంప్ ఏమన్నారంటే..

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

ముంచుకొస్తున్న 1970 చమురు సంక్షోభం.. ధరల పెరుగుదలతో పలు దేశాలు విలవిల..

Russian oil: ట్రంప్ క్లెయిమ్ VS రియాలిటీ.. రష్యా ఆయిల్ కొనుగోలుపై క్లారిటీ ఇచ్చిన న్యూఢిల్లీ!

భారత్ టైర్ పరిశ్రమను కుదిసేస్తున్న ఇరాన్ యుధ్ద ప్రభావం.. కీలకమైన హెచ్చరిక చేసిన CLSA

Iran war: ఇరాన్లో హై అలర్ట్: ఖమేనీ అంత్యక్రియలు వాయిదా.. ఏం జరుగుతోంది?

Iran war: ఇరాన్ సంచలన నిర్ణయం.. అణు బాంబు తయారీ ఆపేస్తాం! కానీ ఆ ఒక్క కండిషన్!

ఇరాన్ మీద దాడులు.. బట్ట బయలైన అమెరికా కుట్రలు.. ప్రపంచానికి నిజాన్ని తెలిపిన స్పెయిన్..

ఇరాన్–అమెరికా యుద్ధంపై షాకింగ్ న్యూస్.. ఎవరి ఆయుధాలు ముందుగా అయిపోతాయో తెలుసా..



Click it and Unblock the Notifications