Kohli business: అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌కు వన్నెతెచ్చిన క్రీడాకారుల్లో విరాట్ కోహ్లీ ఒకడు. తన అత్యద్భుతమైన ఆటతీరులో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. కాగా బిజినెస్‌లోనూ తన హవా చాటేందుకు పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నాడు. తాజాగా భాగ్యనగరంలోనూ పాగా వేశాడు.
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ హైదరాబాద్ నడిబొడ్డున తన కొత్త రెస్టారెంట్ ను ప్రారంభించాడు. 'వన్8 కమ్యూన్' పేరిట ప్రారంభించిన ఈ రెస్టారెంట్.. హైటెక్ సిటీలోని హార్డ్ రాక్ కేఫ్‌కు సమీపంలో ఉన్న నాలెడ్జ్ సిటీ RMZ ది లాఫ్ట్‌లో ఉంది. ఈ మేరకు వివరాలతో కూడిన స్నీక్‌పీక్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

రెస్టారెంట్ లాంచ్ తేదీని మే 24గా ఆయన ప్రకటించాడు. 'హే హైదరాబాద్, ఉత్తేజకరమైన వార్తను మీతో పంచుకోవడానికి నేను థ్రిల్ అవుతున్నాను. మేము ఇప్పుడు హైటెక్ సిటీ నడిబొడ్డుకు చేరుకున్నాము. మీ భోజన అనుభవాన్ని మరింత పెంచాలని భావిస్తున్నాం. one8 కమ్యూన్ అనేది నాకు కేవలం ఒక స్థలం మాత్రమే కాదు.. హైదరాబాద్ ప్రజలను ఒకచోట చేర్చి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించే ప్లాట్‌ఫాం' అని తన భావాలు పంచుకున్నాడు.
రుచికరమైన ఆహారం, క్రికెట్ వైబ్‌లు మరియు సినిమాటిక్ అనుభవాన్ని One8 కమ్యూన్ ఒకే చోట అందిస్తుందన్నారు. ఇక్కడ వాతావరణం స్టైలిష్‌గా ఉన్నప్పటికీ అందరినీ స్వాగతించేలా ఉంటుందని, ఆహార ప్రియులతో పాటు క్రీడాభిమానులకు ఇది సరైనదని భావిస్తున్నట్లు కోహ్లీ చెప్పుకొచ్చాడు. 2017లో స్థాపించిన నాటి నుంచి ఢిల్లీ, ముంబై, పూణే, కోల్‌కతాతో పాటు బెంగళూరు వాసులకు తన సేవలను అందిస్తోంది. కాగా ఇప్పుడు హైదరాబాద్‌కూ విస్తరించింది.


Click it and Unblock the Notifications