భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వరుసగా మూడోసారి భారత్‌లో మోస్ట్ వ్యాల్యుబుల్ సెలబ్రిటీ బ్రాండ్ ఐకాన్‌గా నిలిచాడు. డఫ్ అండ్ ఫెల్ప్స్ అనే సంస్థ సెలబ్రిటీ బ్రాండ్ వ్యాల్యుయేషన్ స్టడీ 2019 పేరుతో చేసిన స్టడీ లిస్ట్‌లో కోహ్లీ, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, సచిన్ టెండుల్కర్ తదితరులు ఉన్నారు. ఈ జాబితాలో కోహ్లీ తొలి స్థానంలో ఉన్నాడు.

కోహ్లీ బ్రాండ్ వ్యాల్యూ రూ.1,690 కోట్లు
డఫ్ అండ్ ఫెల్ఫ్స్ సంస్థ అధ్యయనంలో కోహ్లీ రూ.1,690 కోట్ల (237.5 మిలియన్ డాలర్లు) బ్రాండ్ వ్యాల్యూతో మొదటి స్థానంలో ఉన్నాడు. 2019లో కోహ్లీ బ్రాండ్ వ్యాల్యూ 39 శాతం మేర పెరిగింది.

రెండో స్థానంలో అక్షయ్ కుమార్
రెండో స్థానంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఉన్నాడు. అక్షయ్ బ్రాండ్ వ్యాల్యూ రూ.743 కోట్లు. (104.5 మిలియన్ డాలర్లు.) అత్యధిక బ్రాండ్ వ్యాల్యు కలిగిన టాప్ 20లో క్రికెట్ నుంచి కోహ్లీ సహా నలుగురు క్రికెటర్లు ఉన్నారు.

ధోనీ, రోహిత్, సచిన్
ఎంఎస్ ధోనీ రూ.293 కోట్లతో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. 2018లో 12వ స్థానంలో ఉన్న ధోనీ మూడు స్థానాలు పైకి చేరుకున్నాడు. రోహిత్ శర్మ రూ.163 కోట్ల (23 మిలియన్ డాలర్లు) బ్రాండ్ వ్యాల్యూతో 20వ స్థానంలో నిలిచాడు. రోహిత్ కంటే కోహ్లీ పది రెట్ల బ్రాండ్ వ్యాల్యూ కలిగి ఉన్నాడు. సచిన్ టెండుల్కర్ బ్రాండ్ వ్యాల్యూ రూ.153 కోట్లు. అతను 15వ స్థానంలో ఉన్నాడు.

18వ స్థానంలో అనుష్క శర్మ
విరాట్ కోహ్లీ వైఫ్, బాలీవుడ్ నటి అనుష్క శర్మ కూడా టాప్ 20 స్థానంలో చోటు దక్కించుకుంది. 23.9 మిలియన్ డాలర్లతో (దాదాపు రూ.170 కోట్లు) 18వ స్థానంలో నిలిచారు. టాప్ 20లోని అందరి (మెన్, వుమెన్) మొత్తం వ్యాల్యుయేషన్ 1.1 బిలియన్ డాలర్లుగా ఉంటుందని పేర్కొంది. అంటే దాదాపు రూ.8,000 కోట్లకు సమీపంలో ఉంటుంది.

టాప్ 20లో మొదటి పదిమంది..
విరాట్ కోహ్లీ - 2019లో ర్యాంకు 1, బ్రాండ్ వ్యాల్యూ 237.5
అక్షయ్ కుమార్ - 2019లో ర్యాంకు 2, బ్రాండ్ వ్యాల్యూ 104.5
దీపికా పదుకొణే - 2019లో ర్యాంకు3, బ్రాండ్ వ్యాల్యూ 93.5
రణ్‌వీర్ సింగ్ - 2019లో ర్యాంకు 3, బ్రాండ్ వ్యాల్యూ 93.5
షారుక్ ఖాన్ - 2019లో ర్యాంకు 5, బ్రాండ్ వ్యాల్యూ 66.1
సల్మాన్ ఖాన్ - 2019లో ర్యాంకు 6, బ్రాండ్ వ్యాల్యూ 55.7
అలియా భట్ - 2019లో ర్యాంకు 7, బ్రాండ్ వ్యాల్యూ 45.8
అమితాబ్ బచ్చన్ - 2019లో ర్యాంకు 8, బ్రాండ్ వ్యాల్యూ 42.5
మహేంద్ర సింగ్ ధోనీ - 2019లో ర్యాంకు 9, బ్రాండ్ వ్యాల్యూ 41.2
ఆయుష్మాన్ ఖురానా - 2019లో ర్యాంకు 10, బ్రాండ్ వ్యాల్యూ 40.3

టాప్ 20లో తర్వాత హృతిక్, ప్రియాంక..
హృతిక్ రోషన్ - 2019లో ర్యాంకు 11, బ్రాండ్ వ్యాల్యూ 38.9
వరుణ్ ధావన్ - 2019లో ర్యాంకు 12, బ్రాండ్ వ్యాల్యూ 35.2
ప్రియాంక చోప్రా - 2019లో ర్యాంకు 13, బ్రాండ్ వ్యాల్యూ 32.2
రణ్‌బీర్ కపూర్ - 2019లో ర్యాంకు 14, బ్రాండ్ వ్యాల్యూ 27.0
సచిన్ టెండుల్కర్ - 2019లో ర్యాంకు 15, బ్రాండ్ వ్యాల్యూ 25.1
అమీర్ ఖాన్ - 2019లో ర్యాంకు 16, బ్రాండ్ వ్యాల్యూ 24.9
టైగర్ ష్రాఫ్ - 2019లో ర్యాంకు 17, బ్రాండ్ వ్యాల్యూ 24.2
అనుష్క శర్మ - 2019లో ర్యాంకు 18, బ్రాండ్ వ్యాల్యూ 23.9
కరీనా కపూర్ - 2019లో ర్యాంకు 19, బ్రాండ్ వ్యాల్యూ 23.7
రోహిత్ శర్మ - 2019లో ర్యాంకు 20, బ్రాండ్ వ్యాల్యూ 23.0
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications