ప్రస్తుత కాలంలో ఒక సామాన్య వ్యక్తి ఒంటరిగా బతకాలంటేనే వేలల్లో ఖర్చవుతోంది. అలాంటిది కేవలం పదివేల రూపాయల లోపు ఆదాయంతో ఐదుగురు సభ్యులున్న కుటుంబాన్ని పోషించడం సాధ్యమేనా? ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ (viral) అవుతోంది. సంజీవ్ సింగ్ అనే ఎక్స్ (X) యూజర్ తన అపార్ట్‌మెంట్ లో పనిచేసే ఒక వాచ్‌మన్ గురించి షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెటిజన్ల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే..

అసలేం జరిగింది?
ఎక్స్ (X) లో చేసిన పోస్ట్ ప్రకారం.. ఆ వాచ్‌మాన్ కు కేవలం 25 ఏళ్ల వయసు. అప్పటికే అతనికి పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రీసెంట్ గా ఆ వాచ్‌మన్‌కు మూడవ సంతానం కలిగింది. అతను రెండు వేర్వేరు పనులు చేస్తున్నా, నెలకు వచ్చే మొత్తం ఆదాయం రూ. 10,000 లోపే ఉంటుంది. ఈ తక్కువ జీతంతో తన భార్యను, ముగ్గురు పిల్లలను అతను ఎలా పోషిస్తున్నాడనేది ప్రశ్నార్థకం. "మనం 25 ఏళ్ల వయసులో కెరీర్ గురించి ఆలోచిస్తుంటే, అతను అప్పుడే ఐదుగురి బాధ్యతను మోస్తున్నాడు. పేదరికపు కోరల్లో చిక్కుకున్న ఇలాంటి వారికి ప్రభుత్వ పథకాలు, అవగాహన అందడం లేదు" అని సంజీవ్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.
నెటిజన్ల భిన్నాభిప్రాయాలు
ఈ పోస్ట్ పై ఇంటర్నెట్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఒక వర్గం వారు.. ఇది ముమ్మాటికీ ఆర్థిక అక్షరాస్యత లేకపోవడమేనని వాదిస్తున్నారు. "తక్కువ ఆదాయం ఉన్నప్పుడు సంతాన నియంత్రణ పాటించకపోవడం వల్ల ఆ పిల్లల భవిష్యత్తు అంధకారమవుతుంది. ఇది కేవలం పేదరికం కాదు, బాధ్యతారాహిత్యం కూడా" అని కొందరు విమర్శిస్తున్నారు. కనీస వేతనం కూడా ఇవ్వకుండా అపార్ట్‌మెంట్ వాసులు అతన్ని శ్రమింపజేయడం చట్టవిరుద్ధమని మరికొందరు మండిపడుతున్నారు.
మరో కోణం: పిల్లలే బలం!
అయితే ఇందులో మరో కోణం కూడా ఉంది. అందరూ విమర్శించడమే కాదు.. కొందరు సానుకూలంగా కూడా స్పందిస్తున్నారు. "పిల్లలను భారం అనుకోవడం పొరపాటు. ఆ వాచ్‌మన్ దంపతులకు 45 ఏళ్లు వచ్చేసరికి, ముగ్గురు పిల్లలు సంపాదించే స్థాయికి వస్తారు. అది ఆ కుటుంబానికి పెద్ద ఆసరా అవుతుంది" అని ఒక యూజర్ కామెంట్ చేశారు. పిల్లలు ఉంటే తల్లిదండ్రులకు ఏదైనా సాధించాలనే కసి, బలం పెరుగుతాయని, కేవలం ఆర్థిక కోణంలోనే జీవితాన్ని చూడకూడదని వారు వాదిస్తున్నారు.
జీవన వ్యయం - వాస్తవ పరిస్థితి
నేటి రోజుల్లో పెరిగిన ధరల దృష్ట్యా రూ. 10 వేలతో పప్పు, ఉప్పు కొనడమే కష్టంగా మారింది. అద్దె, కరెంటు బిల్లులు పోగా మిగిలే దాంతో పౌష్టికాహారం అందించడం దాదాపు అసాధ్యం. అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్లు తరచుగా సెక్యూరిటీ రూముల్లోనే నివసిస్తుంటారు కాబట్టి అద్దె భారం తగ్గవచ్చు. కానీ, పిల్లల విద్య, వైద్యం వంటి ఖర్చులు వారిని మరింత కుంగదీస్తాయి. కుటుంబం ఎంత పెద్దగా ఉంటే సంతోషం అంత ఎక్కువగా ఉంటుందని గ్రామీణ ప్రాంతాల్లో నమ్ముతుంటారు. కానీ నగరాల్లోని జీవన వ్యయం ఆ సంతోషాన్ని ఆవిరి చేస్తోంది.
ఏదేమైనా ప్రస్తుతం వైరల్ (viral) అవుతున్న ఈ పోస్ట్ మన సమాజంలోని లోతైన సమస్యలను ఎత్తిచూపుతోంది. కనీస వేతన చట్టాలు సరిగ్గా అమలు కాకపోవడం, పేద వర్గాల్లో కుటుంబ నియంత్రణపై అవగాహన లోపించడం వంటివి దీనికి ప్రధాన కారణాలు. ఆ వాచ్‌మన్ పడుతున్న కష్టం మనకు ఒక పాఠం.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications