భారత్‌లో వెండి ధరల్లోని ప్రాంతాల వారీ తేడా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఒక యూజర్ చేసిన సాధారణ లెక్కలు పెట్టిన ట్వీట్ ఇప్పుడు ట్రేడర్లు, ఇన్వెస్టర్లు, సాధారణ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. రెండు నగరాల మధ్య ఉన్న ధర వ్యత్యాసాన్ని ఉపయోగించి కేవలం ఒక ట్రైన్ ప్రయాణంతోనే వేలల్లో లాభం సాధించవచ్చని చూపించిన ఈ ట్వీట్ వైరల్ అవుతూ చర్చలకు దారితీస్తోంది.
ఫుడ్ కంటెంట్ క్రియేటర్ నలిని ఉనగర్ (@NalinisKitchen) X లో చేసిన ఒక పోస్టు వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌లో ఆమె రెండు భారతీయ నగరాల మధ్య వెండి ధరల్లో గల తేడాను చూపించి, ఒక ట్రైన్ ప్రయాణం ద్వారా రూ.14,000 పైగా లాభం సాధించవచ్చని లెక్క చూపించింది. ఇది ట్రేడర్లు మరియు సాధారణ ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించింది.

ఆమె చెప్పిన లెక్కల ప్రకారం, అక్టోబర్ 14న 1 కిలో వెండి ధర రెండు నగరాల్లో ఇలా పోల్చింది. అహ్మదాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ. 1,89,000 ఉండగా, అదే రోజు విశాఖపట్నంలో రూ. 2,06,000గా ఉంది. అంటే ఒక్క కిలో వెండి పైనే రూ. 17,000 వరకు ధర వ్యత్యాసం కనిపించింది. ఈ తేడాను ఉపయోగించి ఆమె ఒకటి సుచించింది. అహ్మదాబాద్ నుంచి విశాఖపట్నం వరకు రిటర్న్ ట్రైన్ టికెట్ ఖర్చు సుమారు రూ. 2,000 మాత్రమే వస్తుందని తెలిపింది.
ఇలా చూస్తే, ప్రయాణ ఖర్చు, పన్నులు తీసేసినా, ఒక్క ట్రిప్‌లోనే మంచి లాభం వచ్చే అవకాశం ఉందని ఆమె లెక్కలు చెబుతున్నాయి. ఒక్కసారి ట్రిప్ ద్వారా సుమారు రూ.14,490 లాభం వస్తుందని లెక్కించింది. ఇలా నెలలో 3-4 సార్లు చేయండి, అని ఆమె సూచించింది. దాని ప్రకాశం మీకు నేలకి రూ.43,000-రూ.58,000 వరకు సంపాదించవచ్చు.
ప్రాంతాల వారీ ధర తేడా ఉండటానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి. మొదట, రాష్ట్రాల మధ్య GST రేట్లు భిన్నంగా ఉండడం వల్ల, ఒక రాష్ట్రంలో వెండి కొంత ఎక్కువ ఖర్చుగా ఉండే అవకాశం ఉంటుంది. అదే విధంగా, స్థానికంగా ఉన్న డిమాండ్ మరియు సరఫరా కూడా ధరను ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు, ఏదో ఒక నగరంలో వెండి కొని అమ్మే కంటే ఎక్కువ మంది కొనుగోలు చేస్తుంటే, ఆ నగరంలో ధర ఎక్కువగా ఉంటుంది. ఇంకా డీలర్లు తీసుకునే లాభం మరియు రవాణా ఖర్చులు కూడా మొత్తానికి ధరను పెంచుతాయి. చివరగా, స్టాక్ లభ్యత, అంటే లోకల్ దుకాణాలు వద్ద వెండి సరిపడా ఉందా, లేకపోతె కూడా ధరలో తేడా చూపిస్తుంది. ఈ అన్ని కారణాలు కలిపి, ఒక నగరంలో వెండి మరొక నగరానికి పోలిస్తే ఎక్కువ లేదా తక్కువ ధరకు లభించగలదు.
ఈ పోస్టు వైరల్ అయ్యి, చాలా మంది యూజర్లు దీనిని చూసి ఆశ్చర్యపోతున్నారు. కొందరు దీన్ని సరదాగా "ఇంతవరకు ఎవరూ ఊహించని అత్యంత ఇండియన్ బిజినెస్ ఐడియా" అని వ్యాఖ్యానిస్తున్నారు. ఒక యూజర్ కామెంట్ "కొనుగోలు ధర మరియు అమ్మకపు ధర మధ్య పెద్ద తేడా ఉంది. కొనుగోలు ధర రూ.2 లక్షలైతే, అమ్మకపు ధర రూ.1.8 లక్షలు ఉంటుంది. అహ్మదాబాద్‌లో రూ.1.89 లక్షలకు వెండి కొనుగోలు చేసినా, మీరు అదే ధరకు అమ్మలేరు అని చెప్పారు.
ఈ యూట్యూబర్ ప్రధానంగా ఫుడ్ మరియు లైఫ్‌స్టైల్ కంటెంట్‌లో నిపుణురాలు అయినా, ఆమె ట్వీట్ వల్ల అనుకోకుండా భారతదేశంలోని వివిధ నగరాల్లో బంగారం-వెండి ధరల్లో ఉండే తేడాను స్పష్టంగా చూపించింది. ఈ ధర తేడాలు స్థానిక డిమాండ్-సరఫరా, రవాణా ఖర్చులు, రాష్ట్ర పన్నులు, డీలర్ల లాభాలు వంటి కారణాల వల్ల వస్తాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications