IPO News: తొలిరోజే ఇన్వెస్టర్ల సంపద డబుల్.. ఐపీవో లాభాల అరాచకం.. మీరూ కొన్నారా..??
IPO News: వారాంతంలో మార్కెట్లోకి అడుగుపెట్టిన ఐపీవో దుమ్ముదులుపుతోంది. ఏకంగా 100 శాతం ప్రీమియం ధరకు లిస్ట్ అయ్యి ఇన్వెస్టర్లకు లాభాల వర్షాన్ని కురిపించింది.
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది మార్కెట్లో బంపర్ లిస్టింగ్ నమోదు చేసి ఇన్వెస్టర్లను షాక్ కి గురిచేసిన విన్యాస్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ ఐపీవో గురించే. తొలిరోజు ఎన్ఎస్ఈలో షేర్లు 100 శాతం ప్రీమియం రేటుకు లిస్ట్ అయ్యాయి. కంపెనీ షేర్లను రూ.165 రేటుకు ఇష్యూ చేయగా.. మార్కెట్లో ఒక్కొక్కటి రూ.330 ధరకు జాబితా చేయబడ్డాయి. ఇన్వెస్టర్ల సబ్‌స్క్రిప్షన్ కోసం సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 3 వరకు ఐపీవో తెరచి ఉంది. ఈ క్రమంలో ఒక్కో లాటులో 800 ఈక్విటీ షేర్ల చొప్పున కంపెనీ ఐపీవోలో విక్రయించింది. ఉదయం 11.22 గంటల సమయంలో 110 శాతం లాభంతో స్టాక్ రూ.346.50 రేటు వద్ద ఎన్ఎస్ఈలో ట్రేడింగ్ కొనసాగిస్తోంది.

మార్కెట్లో విన్యాస్ ఇన్నోవేటివ్ ఐపీవోకు రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి విశేషమైన స్పందన కనిపించింది. సబ్‌స్క్రిప్షన్ స్టేటస్ నాలుగో రోజు 43.24 రెట్లుగా నమోదైంది. ఈ క్రమంలో రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 21.27 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ వాటా 95.16 రెట్లు, QIBల పోర్షన్ 42.74 రెట్లు స్పందనను కనబరిచింది. కంపెనీ ఐపీవో కోసం 22,03,200 షేర్లను విక్రయించగా.. 9,52,62,400 షేర్లకు బిడ్‌లు దాఖలయ్యాయి.
2001లో స్థాపించబడిన విన్యాస్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఎలక్ట్రానిక్ పరిశ్రమలో గ్లోబల్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులు, ఒరిజినల్ డిజైన్ తయారీదారులకు డిజైన్, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ తయారీ సేవలను అందిస్తోంది. కంపెనీ కస్టమర్లకు బిల్డ్ టు ప్రింట్(B2P), బిల్డ్ టు స్పెసిఫికేషన్ (B2S) సేవలను అందిస్తోంది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ పన్నుల తర్వాత ఆదాయం రూ.734.34 లక్షలుగా నమోదైంది.


Click it and Unblock the Notifications