IPO News: చిచ్చర పిడుగులా మార్కెట్లోకి ఐపీవో.. ఇన్వెస్టర్లకు బంపర్ లాభాలు.. కొన్నారా..?

Vinsys IT Services IPO: దేశంలో ఐపీవోలకు క్రేజ్ మామూలుగే లేదు. ఒకప్పటిలా కాకుండా కంపెనీలు పెట్టుబడిదారులకు ఆశ్చర్యకరమైన లాభాలను అందిస్తున్నాయి. చాలా కంపెనీలు తొలిరోజే చిచ్చర పిడుగుల్లా దూసుకుపోతున్నాయి.

చిన్న కంపెనీల ఐపీవోలు స్టాక్ మార్కెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్నాయి. భారీ లాభాలతో వీటి షేర్లు లిస్టింగ్ అవుతున్నాయి. అలాంటి కంపెనీయే విన్సిస్ ఐటీ సర్వీసెస్ కూడా అని నిరూపించుకుంది. ఈరోజే మార్కెట్లో లిస్ట్ అయిన విన్సిస్ ఇష్యూ ధర కంటే 62 శాతం ప్రీమియం ధరను పొందింది. లిస్టింగ్ తర్వాత ఐటీ కంపెనీ షేర్లు ఏకంగా 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకి ఇన్వెస్టర్లకు లాభాల పంట పడించింది.

Vinsys IT Services IPO gave bumper returns to investors listing at premium

ఐపీవో కోసం స్టాక్ ప్రైస్ బ్యాండ్ రూ.121-128గా కంపెనీ నిర్ణయించింది. అయితే కంపెనీ షేర్లను సబ్‌స్క్రైబర్లకు రూ.128 రేటుకు ఎలాట్ చేసింది. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ సూపర్ ప్రీమియం ధర రూ.207.25 వద్ద మార్కెట్లో లిస్ట్ అయ్యాయి విన్సిస్ IT సర్వీసెస్ షేర్లు. అంటే మొదటి రోజే IPO పెట్టుబడిదారులకు ఒక్కో షేరుపై రూ.79.25 ఆదాయం పొందారు. అంటే పెట్టుబడిపై 62 శాతం రాబడి. అయితే ప్రస్తుతం కంపెనీ షేర్లు రూ.217.60 వద్ద 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి.

ఐపీవో ఇష్యూ సమయంలో కంపెనీ షేర్లు 89 సార్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. ఆగస్టు 1న ప్రారంభమైన ఐపీవో ఆగస్టు 4న ముగిసింది. ఇదే సమయంలో రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 111.56 రెట్లు సబ్‌స్క్రిప్షన్ పొందింది. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్(QIB) కోటా 36.95 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటా 105.75 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. కంపెనీ ఒక్కో లాట్ కింద 1000 షేర్లను విక్రయించింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+