Gautam Adani: అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ తన నివేదికలో అదానీ గ్రూప్ అకౌంటింగ్ మోసాలకు పాల్పడినట్లు వెల్లడించింది. ఈ క్రమంలో గౌతమ్ అదానీకి ప్రయోజనం కలిగించటం కోసం వినోద్ అదానీ ఆఫ్‌షోర్ షెల్ ఎంటిటీలను నిర్వహించినట్లు ఆరోపించింది. వినోద్ అదానీ లేదా అతని సన్నిహితుల నియంత్రణలో ఉన్న 38 మారిషస్ ఆధారిత సూట్ కేస్ కంపెనీల రోజువారీ వ్యవహారాల్లో వినోద్ అదానీకి ఎలాంటి పాత్ర లేదంటూ అదానీ గ్రూప్ ఇటీవల కొట్టిపారేసింది.

షాకింగ్ రిపోర్ట్..
ఇటీవల అదానీ గ్రూప్ సిమెంట్ వ్యాపారాలను కొనుగోలు చేసేందుకు నేరుగా విదేశీ అనుబంధ సంస్థను ఉపయోగించలేదని నివేదిక వెలుగులోకి వచ్చింది. అయితే అంబుజా సిమెంట్స్, ఏసీసీ సిమెంట్స్ కంపెనీలను కొనుగోలు చేయటానికి ఆఫ్‌షోర్ సంస్థల నెట్‌వర్క్‌ను ఉపయోగించినట్లు బయటపడింది. అంబుజా సిమెంట్స్ జారీ చేసిన చివరి ఆఫర్ లెటర్ ప్రకారం.. మారిషస్, దుబాయ్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లోని సంస్థల ద్వారా ఎండీవర్ అంతిమ ప్రయోజనకరమైన యజమానులు వినోద్ శాంతిలాల్ అదానీ, ఆయన భార్య అని బయటపడింది.
టీఎంసీ ఎంపీ టార్గెట్
..
మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ద్వారా అదానీపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవటంపై, కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని TMC MP మహువా మొయిత్రా ట్వీట్ చేశారు. అంబుజా సిమెంట్స్, ఏసీసీ సిమెంట్స్ అదానీ గ్రూప్ సొంత కంపెనీలు కాదని ఆమె తన ట్వీట్ లో వెల్లడించారు. అంబుజా సిమెంట్స్ తన పుస్తకాలపై డిసెంబర్ 2022 చివరి నాటికి రూ.9,829 కోట్ల నగదు మరియు నగదుకు సమానమైన వాటిని కలిగి ఉన్నట్లు వెల్లడించారు.

కంపెనీల కొనుగోలు..
హోల్సిమ్‌తో డీల్ వివరాలను పంచుకుంటూ అదానీ గ్రూప్ తన ప్రకటనలో 14 అంతర్జాతీయ బ్యాంకుల నుంచి 4.50 బిలియన్ డాలర్ల సహకారం ద్వారా లావాదేవీకి నిధులు సమకూర్చుకున్నట్లు పేర్కొంది. బార్‌క్లేస్ బ్యాంక్ PLC, డ్యుయిష్ బ్యాంక్ AG, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్‌లు ఈ లావాదేవీకి అసలైన ప్రధాన నిర్వాహకులు, బుక్-రన్నర్‌లుగా వ్యవహరించాయి. ఈ తరుణంలో హిండెన్ బర్గ్ నివేదికపై జనవరి 29న స్పందించింది. వినోద్ అదానీ ఏ అదానీ లిస్టెడ్ ఎంటిటీలు లేదా వాటి అనుబంధ సంస్థలలో ఎటువంటి నిర్వాహక పదవిని కలిగి ఉండరని, రోజువారీ వ్యవహారాల్లోనూ ఎలాంటి పాత్ర కలిగి ఉండరని బదులిచ్చింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications