vinayaka chaturthi 2025: భారతదేశంలో ఒక పండుగకు ఇంత పెద్ద మొత్తంలో బీమా తీసుకోవడం ఇదే తొలిసారి. ముంబైలోని జీఎస్‌బీ సేవా మండల్ మహా గణపతి..అత్యంత కాస్ట్ లీ గణేశుడి విగ్రహం గా ప్రసిద్ధి పొందింది. ఈసారి ఈ గణేశోత్సవానికి రూ. 474.46 కోట్ల భారీ బీమా కవర్ తీసుకున్నారు. గత సంవత్సరం (2024) ఇది రూ. 400.58 కోట్లుగా ఉండగా ఈసారి దాన్ని రికార్డు స్థాయిలో పెంచారు. ఈ బీమా కవర్‌ను న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ అందించింది. అయితే, బీమా కోసం చెల్లించిన ప్రీమియం మొత్తాన్ని మండలి నిర్వహణ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
జీఎస్‌బీ సేవా మండలి చైర్మన్ అమిత్ డి. పాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇందులో రూ. 67.03 కోట్లు బంగారం, వెండి, ఆభరణాలు, ఇతర విలువైన వస్తువుల రక్షణకు ఆల్ రిస్క్ పాలసీ కింద కవర్ చేశారు. ఇక రూ.2 కోట్లు భూకంపం, అగ్నిప్రమాదం, ఇతర ప్రత్యేక ప్రమాదాల కవర్లకు కేటాయించారు. ఇవి ఫర్నిచర్, కంప్యూటర్లు, CCTV కెమెరాలు, QR స్కానర్లు, పాత్రలు, పండ్లు, కూరగాయలు వంటి ఉత్సవంలో ఉపయోగించే సామాగ్రిని కవర్ చేస్తాయి.

ఇక రూ. 30 కోట్లు ప్రజా బాధ్యత (పబ్లిక్ లయబిలిటీ) కోసం కేటాయించారు. దీని కింద పండళ్లు, స్టేడియం ప్రాంగణం, భక్తులకు సంభవించే ప్రమాదాల కవర్ ఉంటుంది.మరో 375 కోట్లు అతిపెద్ద మొత్తం స్వచ్ఛంద సేవకులు, వంటవారు, సెక్యూరిటీ సిబ్బంది, గాడీలు, చప్పల్ స్టాల్ కార్మికులు, వాలెట్ పార్కింగ్ సిబ్బంది వంటి ఉత్సవంలో పనిచేసే వేలాది మందికి వ్యక్తిగత ప్రమాద బీమా కింద కవర్ చేశారు. దీనికి అదనంగా, వేదిక ప్రాంగణానికి రూ. 43 లక్షల ప్రత్యేక బీమా తీసుకున్నారు.
జీఎస్‌బీ గణపతి విగ్రహం ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. ఇది 69 కిలోలకుపైగా బంగారు ఆభరణాలు, 336 కిలోల వెండితో అలంకరించబడుతుంది. ఈ ఆభరణాలను ఎక్కువగా భక్తులు, సేవకులు విరాళంగా ఇస్తారు. అందుకే దీనిని అత్యంత ధనిక గణేశుడు అని అంటారు. ముంబైలోని ఇతర గణేశ మండలాలతో పోలిస్తే జీఎస్‌బీ సేవా మండల్ ప్రత్యేకత ఏమిటంటే 24 గంటలపాటు పూజలు, అర్చనలు, అన్నదానాలు నిరంతరం కొనసాగుతాయి. ఇది రుగ్వేద సంప్రదాయం ప్రకారం జరిగే ఏకైక మండలిగా చెబుతారు.
జీఎస్‌బీ సేవా మండలి కేవలం ఉత్సవం మాత్రమే నిర్వహించదు. ప్రతి సంవత్సరం సమాజంలోని బలహీన వర్గాలకు విద్య, అభివృద్ధి అవకాశాలను అందిస్తుంది.అలాగే ప్రతి సంవత్సరం సమాజంలోని వెనుకబడిన వర్గాల పిల్లలకు విద్యను అందించడం ద్వారా వారి జీవితాలను మార్చే దిశగా కృషి చేస్తామని మండలి అధ్యక్షుడు అమిత్ పాయ్ తెలిపారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications