Multibagger Stock: మంచి మల్టీ బ్యాగర్ స్టాక్ దొరకటమంటే లంకెబిందెలు దొరకటం లాంటిదే అని చెప్పుకోవాలి. ఎందుకంటే అవి తక్కువ కాలంలోనే ఇన్వెస్టర్ల పెట్టుబడిని ఊహించని రీతిలో పెంచేస్తాయి. అలా వార్తల్లో నిలిచిందే వికాస్ లైఫ్‌కేర్ అనే పెన్నీ స్టాక్ కూడా. కంపెనీ తాజాగా మార్కెట్ నుంచి రూ.50 కోట్ల నిధిని సేకరించింది. నోమురా సింగపూర్ లిమిటెడ్, ఫోర్బ్స్ EMF, AG డైనమిక్స్ ఫండ్స్ లిమిటెడ్ వంటి విదేశీ పెట్టుబడిదారులు ఇందులో పాల్గొని కంపెనీలో వాటాను దక్కించుకున్నాయి. వికాస్ లైఫ్‌కేర్ ఈ ఫండ్ రైజింగ్ డ్రైవ్ కింద మొత్తం 12కోట్ల 50 లక్షల ఈక్విటీ షేర్లను జారీ చేసింది. అందులో 5,40,00,000 ఈక్విటీ షేర్లను ఫోర్బ్స్ EMFకి కేటాయించగా, 4,40,00,000 ఈక్విటీ షేర్లు సింగపూర్ సంస్థ నోమురా దక్కించుకుంది. అదే సమయంలో.. AG డైనమిక్ ఫండ్స్ లిమిటెడ్ 2,70,00,000 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. కంపెనీ ఈ ఆఫర్ 25 మే 2022న ప్రారంభించింది. 2 జూన్ 2022న దీనిని క్లోజ్ చేసింది. ఒక్కో షేరుకు రూ.4 చొప్పున సదరు సంస్థలకు జారీ చేసింది.
వికాస్ లైఫ్‌కేర్ షేర్ పైస్ హిస్టరీ:
వికాస్ లైఫ్‌కేర్ షేర్ పైస్ హిస్టరీని పరిశీలిస్తే.. ఈ స్టాక్ ఈ సంవత్సరం తన వాటాదారులకు అద్భుతమైన రాబడిని అందించింది. గత నెలలో.. వికాస్ లైఫ్‌కేర్ షేర్ రూ.4.60 నుంచి రూ.5.40కి పెరిగింది. షేర్ కేవలం నెలలో తన ఇన్వెస్టర్లకు 15 శాతం రాబడిని ఇచ్చింది. ఈ ఏడాది ఇప్పటివరకు ఈ స్టాక్ దాని వాటాదారులకు మెత్తంగా 25 శాతం కంటే ఎక్కువ రాబడిని అందించింది. అయితే ఈ షేర్ ధర గత 6 నెలల్లో 60 శాతానికి పైగా పెరిగింది.

ఏడాదిలో 101 శాతం ర్యాలీ:
ఈ స్టాక్ గత ఏడాది కాలంలో మంచి రాబడులను ఇచ్చి మల్టీబ్యాగర్‌గా నిరూపించబడింది. మే 7న NSEలో దీని ముగింపు ధర రూ.2.66గా ఉంది. ప్రస్తుతం షేర్ ధర దాదాపు రూ.5.40గా ఉంది. ఏడాది వ్యవధిలో ఈ స్టాక్ దాదాపు 101 శాతం ర్యాలీ చేసింది. వికాస్ లైఫ్‌కేర్ వాటా ఇటీవలి సంవత్సరాల్లో భారతీయ స్టాక్ మార్కెట్లో మరొక బలమైన పెన్నీ స్టాక్‌గా నిరూపించుకుంది.
Note: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మీ వ్యక్తిగత విచక్షణను ఉపయోగించండి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మీ ఆర్థిక సలహాదారు నుంచి సలహాలు, సూచనలు తీసుకోవటం ఉత్తమం.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications