Vijaya Dairy: విజయ డైరీ నుంచి మరో 100 కొత్త ఉత్పత్తులు..

విజయ డెయిరీని లాభాల్లోకి తెవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. తాజాగా విజయ డెయిరీ రాష్ట్రవ్యాప్తంగా మరో 2000 అవుట్​లెట్స్​ను ప్రారంభించడంతోపాటు​ మరో 100 కొత్త ప్రొడక్టులను తేనుందని తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ (టీఎస్​డీడీసీఎఫ్​) వెల్లడించింది. హైదరాబాద్ ​లో శుక్రవారం హైటెక్స్‌‌‌‌లో డెయిరీ/ఫుడ్ ప్రొడక్ట్స్, ప్రాసెసింగ్ & ప్యాకేజింగ్‌‌‌‌తో కూడిన ట్విన్ డెయిరీ అండ్ ఫుడ్ ఎగ్జిబిషన్​ ను హోం మంత్రి మహ్మద్ అలీ ప్రారంభించారు.

ఈ ఎగ్జిబిషన్ మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. ఒకప్పుడు మూతపడిన విజయ డెయిరీ ఇప్పుడు బాగా పనిచేస్తోందని టీఎస్​డీడీసీఎఫ్ చైర్మన్​ సోమ భరత్ కుమార్ వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.700 కోట్ల టర్నోవర్ సాధించిందని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.1000 కోట్ల టర్నోవర్​ ను లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం విజయా డెయిరీకి సుమారు 1000 అవుట్‌‌‌‌లెట్స్​ ఉన్నాయని పేర్కొన్నారు. విజయ డెయిరీలో 27 ఉత్పత్తులు విక్రయిస్తున్నారు.

Vijaya Dairy will soon bring 100 more products

తాజాగా మిల్క్ షేక్, కాఫీ, టీ, ఫ్లేవర్డ్ మిల్క్, ఐస్ క్రీం, కుల్ఫీ, కుకీలు, హెల్త్ బార్‌‌‌‌లు మొదలైన 100 ఉత్పత్తులను తీసుకురాబోతున్నట్లు చెప్పారు.హైదరాబాద్ ​కు ప్రతిరోజు కోటి లీటర్ల పాలు అవసరమని... ఉత్పత్తి 70 లక్షలు మించడం లేదని చెప్పారు. పాల ఉత్పత్తిని పెంచడానికి రెండు లక్షల జంతువులను కొని రైతులకు అప్పగిస్తామన్నారు. ఈ ఎగ్జిబిషన్ లో కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా, గోద్రెజ్ క్రీమ్‌‌‌‌లైన్ జెర్సీ ప్రొడక్ట్స్, దొడ్ల డెయిరీ వంటి 105 మంది ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+