Vijay Shekhar Sharma: వ్యాపారంలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా చిన్న స్థాయి నుంచి ప్రారంభించి డిజిటల్ పేమెంట్స్ స్టార్టప్ పేటీఎం స్థాపించటం వరకు వచ్చారు విజయ శేఖర శర్మ. అయితే ప్రస్తుతం గతంలో ఆయన చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకున్నానని, ఇంకా మంచిగా పనిచేసి ఉండాల్సిందంటూ తాజాగా స్పందించారు.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ గతంలో తీసుకున్న కఠిన చర్యలపై వ్యవస్థాపకుడు విజయ శేఖర శర్మ మరోసారి స్పందించారు. ఈ క్రమంలో మాట్లాడుతూ తాను వృత్తిపరమైన బాధ్యతలను మెరుగ్గా నిర్వహించడానికి పాఠాలు నేర్చుకున్నానని, రిజర్వు బ్యాంక్ చర్య వ్యక్తిగత స్థాయిలో భావోద్వేగ షాక్ అని అంగీకరించారు. తాము వృత్తిపరంగా మరింత మెరుగ్గా రాణించి ఉండాల్సిందని పేర్కొన్నారు. తమపై ఉన్న బాధ్యతలను మెరుగైన మార్గాల్లో నెరవేర్చాలన్నారు.

కొన్ని నెలల కిందట ఆర్బీఐ వ్యాపారులతో సహా కస్టమర్ల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని రిజర్వ్ బ్యాంక్ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌ను డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలు లేదా ఏదైనా కస్టమర్ ఖాతా, వాలెట్, ఫాస్టాగ్‌లో టాప్-అప్ చేయడాన్ని నిషేధించిన సంగతి తెలిసిందే. దీనికంటే ఛాలెంజింగ్ టైమ్స్‌ని ఎదుర్కొన్నానని విజయ్ శేఖర్ శర్మ చెప్పారు. 2013-14లో కంపెనీకి నిధుల కొరత ఏర్పడిందని ఆ సమయంలో నిధుల సేకరణకు కంపెనీ వెల్లిందన్నారు. అయితే తనకు కంపెనీ సొంత కూతురు లాంటిదని శర్మ అన్నారు. రోజువారీ వ్యాపారంలో వస్తున్న ఒడిదొడుకులు, సమస్యల నుంచి నేర్చుకుంటూ ఒక కంపెనీగా మేము పరిపక్వం చెందుతున్నామన్నారు. స్కూల్లో టాపర్ అయిన కూతురు ఎంట్రన్స్ ఎగ్జామ్ కి వెళ్తుండగా ప్రమాదంలో పడినట్లేనన్నారు.
డిజిటల్ పేమెంట్స్ స్టార్టప్‌లను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడం ద్వారా ప్రభుత్వం నిజంగా గోల్డెన్ పీరియడ్‌ను ప్రారంభించిందని విజయ్ శేఖర్ శర్మ అన్నారు. స్టార్టప్‌లను కెరీర్‌గా స్వీకరించడంలో అట్టడుగున ఉన్న రోజుల నుంచి ఇది ఆశ్చర్యకరమైన మార్పుగా పేర్కొన్నారు. ఉద్యోగార్థులు విదేశాలకు వెళ్లేందుకు లేదా విదేశీ ఐటీ కంపెనీలు లేదా పెద్ద దేశీయ సాంకేతిక సంస్థలలో ఉద్యోగాలు ఆశించే కాలం నుంచి భారతదేశం చాలా ముందుకు వచ్చిందని శర్మ చెప్పారు. ప్రస్తుతం కాలేజీ నుంచి బయటకు వచ్చి ఉద్యోగాలు వెతుక్కునే వారు విదేశాల్లో ఉద్యోగాల కోసం వెతకడం కంటే భారత్‌లోనే ఉండేందుకు ఇష్టపడుతున్నారని శర్మ పేర్కొన్నారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications