బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యా తాజాగా మళ్లీ వార్తల్లోకెక్కారు.. తొమ్మిదేళ్ల తర్వాత మీడియా ముందుకు వచ్చి పలు కీలక విషయాలను వెల్లడించారు. బ్యాంకుల్లో తాను చేసిన మొత్తం అప్పులు, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పతనం, ఇండియాలో వ్యాపారంపై రాజకీయ జోక్యం, ముఖ్యమంత్రులతో సంబంధాలు, ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు ఇచ్చే నిధులు ఇలా అనేక విషయాలపై విజయ్ మాల్యా తన అభిప్రాయాలను ప్రముఖ యూట్యూబర్ రాజ్ షమాని ఫిగరింగ్ అవుట్ పాడ్‌క్యాస్ట్‌లో 4 గంటల ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
భారత్ లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఓ అపోహ అని చెప్పిన లిక్కర్ కింగ్ దేశంలో వ్యాపారం చేయాలంటే రాజకీయ జోక్యం తట్టుకోవాలన్నారు. రాజకీయ నేతల కనుసన్నల్లోనే వ్యాపారం నడపాలన్నారు. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ పతనం 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా జరిగిందని చెప్పుకొచ్చారు. విజయ్ మాల్యా భారతదేశంలోని అనేక బ్యాంకుల నుండి మొత్తం రూ. 9000 కోట్ల అప్పులు కలిగి ఉన్నాడు. 2016లో దేశం విడిచి వెళ్లిపోయాడు. అనంతరం అది భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంకు కుంభకోణాలలో ఒకటిగా మారింది.

దీనిపై విజయ్ మాల్యా స్పందిస్తూ..తాను దేశం నుంచి పారిపోలేదని, ముందే నిర్ణయించిన పర్యటన కోసమే లండన్ వెళ్ళానని చెప్పారు.ఆ తర్వాత తిరిగి రాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. తాను పరారీలో మాత్రమే ఉన్నానని దొంగను ఎంత మాత్రం కాదని విజయ్ మాల్యా స్పష్టం చేశారు. బ్యాంకులకు తన సెటిల్‌మెంట్ కోసం ఆఫర్లను అందిస్తే అవి తిరస్కరించాయని తెలిపారు.
అప్పులే యుబి గ్రూప్ పాలిట శాపం : విజయ్ మాల్యా చేసిన అప్పులే యుబి గ్రూప్ ( యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్) పాలిట శాపమైంది. విజయవంతంగా నడుస్తున్న యుబి గ్రూప్ పతనానికి ప్రధాన కారణం కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అని చెప్పుకోవచ్చు.ఈ ఎయిర్ లైన్స్ కోసం విజయ్ మాల్యా బ్యాంకుల నుంచి కోట్లాది రూపాయలను రుణంగా తీసుకున్నాడు.తండ్రి వ్యాపార వారసత్వాన్ని అందిపుచ్చుకున్న విజయ్ మాల్యా యుబి గ్రూప్ కు చైర్మన్ అయ్యాడు. యుబి గ్రూప్ కింగ్ ఫిషర్ బీర్ ను భారతదేశంలో ప్రముఖ బీర్ బాండ్లలో ఒకటిగా నిలిపాడు.
కింగ్ ఫిషర్ పేరుతో దేశీయ ఎయిర్ లైన్స్: అయితే అంతటితో ఆగకుండా దానిని మరింత పాపులర్ చేయాలనే ఉద్దేశంతో విమానయాన రంగంలోకి ప్రవేశించాడు. కింగ్ ఫిషర్ పేరుతో దేశీయ ఎయిర్ లైన్స్ ప్రారంభించారు. అయితే ఈ కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సామాన్యులకు చేరువ కాలేకపోయింది. దీంతో లాభాల బాట నుంచి నష్టాల బాటలోకి ప్రయాణించింది. దీంతో అందులో పెట్టుబడులు పెట్టడమే తప్ప రాబడి ఏ మాత్రం అందుకోలేకపోయాడు విజయ్ మాల్యా.
దీంతో అప్పులు తట్టుకోలేక కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ను డెక్కన్ ఏవియేషన్ లో 2007లో విలీనం చేశాడు. దీంతో అంతర్జాతీయ విమానాయాన రంగంలోకి కూడా ప్రవేశించాడు. అయితే విజయ్ మాల్య తీసుకున్న నిర్ణయం తప్పని కొద్ది కాలానికే అతనికి తెలిసి వచ్చింది. 2012 నాటికి కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. కనీసం ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితికి వెళ్లిపోయింది.
కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ లైసెన్స్ రద్దు : ఈ పరిణామాల నేపథ్యంలో 2012లో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ లైసెన్స్ ను DGCA రద్దు చేసింది. దీంతో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ వ్యాపార సామ్రాజ్యం ఆగిపోయింది.అయితే అప్పటికే విజయ్ మాల్యా రూ. 9000 కోట్ల అప్పును కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కోసం చేశాడు. ఈ అప్పు వల్ల లాభాల్లో ఉన్న యూబీ గ్రూపు కూడా సర్వనాశనం అయింది. తర్వాత బ్యాంకులు అప్పులు తీర్చాలని పట్టుబట్టడంతో చేసేది లేక 2016లో దేశం విడిచి యూకేకి పారిపోయాడు విజయ్ మాల్యా.
దేశంలో మద్యం వ్యాపారం చాలా రిస్క్ : మద్యం వ్యాపారంపై విజయ్ మాల్యా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దేశంలో మద్యం వ్యాపారం నిర్వహించాలంటే.. 29 రాష్ట్రాలతో కలిసి పనిచేయాలని ఒక్కో రాష్ట్రానికి ఒక్కో మద్యం పాలసీ ఉంటుందని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సత్సంబంధాలు కలిగి ఉండాలన్నారు. ఈ వ్యవహారం కత్తిమీద సాములాంటిదని చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో మద్యం వ్యాపారుల నుంచి ఎన్నికల ప్రచారం కోసం అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు నిధులు డిమాండ్ చేశాయని చెప్పుకొచ్చారు. అవి తట్టుకోలేక అప్పుడప్పుడూ దేశం విడిచి వెళ్లిపోయేవాడినని తెలిపారు మాల్యా.
తన రుణం కంటే రెండు రెట్లు ఎక్కువ రికవరి చేశారు : ఇక బ్యాంకులకు తాను ఉన్న అప్పులు, చెల్లించిన మొత్తం విషయంలో తనకు తీవ్ర అన్యాయం జరిగిందని విజయ్ మాల్యా అన్నారు. డెట్ రికవరీ ట్రిబ్యునల్ (DRT) తీర్పు ప్రకారం తాను బ్యాంకులకు చెల్లించాల్సింది రూ. 6,203 కోట్లు అయితే ఇప్పటికే..రూ.14,131.6 కోట్లకు పైగా తన నుంచి బ్యాంకులు రికవరీ చేశాయన్నారు. తన రుణం కంటే రెండు రెట్లు ఎక్కువ ఎలా రికవరీ చేస్తారని చెప్పుకొచ్చారు. తాను ఒకవేళ బ్యాంకులను మోసం చేసి ఉంటే, ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తాన్ని ఎలా రికవరీ చేసిందని మాల్యా క్వశ్చన్ చేస్తున్నారు. ఇది తాను "దొంగ" కాదన్నదానికి నిదర్శనం అని మాల్యా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాను దొంగను ఎప్పటికీ కానని కేవలం పరారీలో మాత్రమే ఉన్నానని విజయ్ మాల్యా తెలిపారు.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications