లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యా బకాయిల వసూలుకు ఎస్‌బీఐ నేతృత్వంలో గల బ్యాంకుల కన్సార్షియం సిద్ధమైంది. మాల్యాకు చెందిన యునైటెడ్ బ్రూవరీస్, యునైటెడ్ స్పిరిట్స్, మెక్‌డోవెల్స్ హోల్డింగ్స్ కంపెనీల్లో ఉన్న షేర్లను ఈ నెల 23న బ్లాక్ డీల్ ద్వారా అమ్మకానికి పెడుతున్నారు. ఈ అమ్మకం ద్వారా ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం బ్యాంకులకు రూ.6,200 కోట్ల వరకు వసూలయ్యే అవకాశం ఉంది.
బ్లాక్‌డీల్‌కు స్పందన లేకపోతే 24 నుంచి బల్క్ లేదా రిటైల్‌గా అమ్మకాలని బ్యాంకులు భావిస్తున్నాయి. ఈ షేర్ల అమ్మకానికి బెంగళూరు డెట్ రికవరీ ట్రైబ్యునల్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం బ్యాంకులు మాల్యాకు రూ.9,000 కోట్ల వరకు రుణాలుగా ఇచ్చిన సంగతి తెలిసిందే. వడ్డీ కూడా కలిపితే విజయ్ మాల్యా నుంచి రావాల్సిన మొత్తం రూ.12,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

కొన్ని కంపెనీల్లో మాల్యాకు ఉన్న షేర్లతోపాటు మాల్యా పేరు మీద ఉన్న కొన్ని ఆస్తులనూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంది. వీటి విలువ ఎంత లేదన్నా రూ.12,500 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. అసలుతో సరిపెట్టుకోండని మాల్యా చేసిన ప్రతిపాదనను బ్యాంకులు ఇప్పటికే తోసిపుచ్చాయి. పూచీకత్తుగా ఇచ్చిన మాల్యా ఆస్తులు అమ్మి తమ బకాయిలు వసూలు చేసుకోవాలని బ్యాంకులు భావిస్తున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications