రూ. 10,270 కోట్లు రికవరీ చేసినా..ఇంకా రూ. 8,752 కోట్లు బాకీ.. విజయ్ మాల్యా బకాయిలపై SBI కీలక ప్రకటన..

Vijay Mallya Case Update: బ్యాంకులకు ఎగవేసిన బకాయిలన్నింటినీ విజయవంతంగా చెల్లించేశానని.. తనపై ఉన్న కేసులను ఎత్తివేయాలని పరారీలో ఉన్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా చేస్తున్న వాదనలకు దేశీయ బ్యాంకింగ్ దిగ్గజాలు షాకిచ్చాయి. మాల్యా నుండి ఇంకా సుమారు రూ. 8,752 కోట్ల బకాయిలు వసూలు కావాల్సి ఉందంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నేతృత్వంలోని రుణదాతల కన్సార్టియం బాంబే హైకోర్టుకు సమర్పించిన తాజా అఫిడవిట్‌లో స్పష్టం చేసింది.

మూతపడిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ వ్యవస్థాపకుడు, యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ మాజీ ఛైర్మన్ విజయ్ మాల్యాపై దేశంలోని పలు బ్యాంకులు వేల కోట్ల రూపాయల రుణ ఎగవేత మోసానికి సంబంధించి కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 2019లో పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడిగా (Fugitive Economic Offender) గుర్తింపు పొందిన మాల్యా.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసిన తన ఆస్తుల రికవరీ తర్వాత బ్యాంకులతో ఆర్థిక విభేదాలు సమసిపోయాయని వాదిస్తున్నారు. తనపై నమోదు చేసిన క్రిమినల్ అభియోగాలు, మనీలాండరింగ్ కేసులను కొట్టివేయాలని కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు.

Vijay Mallya Vijay Mallya News Vijay Mallya Debt Vijay Mallya Debt Recovery Vijay Mallya Case SBI SBI-led Consortium SBI vs Vijay Mallya 8 752 Crore 8 751 86 Crore 10 270 Crore Recovery Bombay High Court Money Laundering Case Kingfisher Airlines Bank Loan Recovery Bank Dues Debt Recovery Fugitive Economic Offender ED PMLA DRT Vijay Mallya Vijay Mallya News Vijay Mallya Debt Vijay Mallya Debt Recovery Vijay Mallya Case SBI SBI Consortium SBI vs Vijay Mallya

అయితే హైకోర్టు ఆదేశాల మేరకు రుణాలు ఇచ్చిన బ్యాంకింగ్ సంస్థలు సమర్పించిన నివేదిక ఈ వాదనను పూర్తిగా తప్పుబట్టింది. డెట్ రికవరీ ట్రిబ్యునల్ (DRT) విచారణలకు ముందు దాదాపు రూ. 544.58 కోట్లు, ఆ తర్వాత బాండ్ గ్యారంటీ ఆధారంగా రూ. 10,270 కోట్లను "తాత్కాలికంగా" రికవరీ చేసినప్పటికీ, ప్రధాన రుణ బకాయిలు ఇంకా పూర్తిగా తీరలేదని బ్యాంకులు పేర్కొన్నాయి. ఈ ఏడాది జనవరి నాటికి మాల్యా ఇంకా రూ. 8,135.63 కోట్లు బాకీ ఉండగా.. న్యాయపరమైన రుసుములు, ఇతర నిర్వహణ వ్యయాలు కలుపుకుని ఆగస్టు 31 నాటికి ఈ బకాయి మొత్తం రూ. 8,751.86 కోట్లకు పెరిగిందని కన్సార్టియం వెల్లడించింది.

Also Read

అంతేకాకుండా విచారణ క్రమంలో జప్తు చేసిన నిర్దిష్ట ఈక్విటీ షేర్లను ఇంకా విక్రయించలేదని, వాటి నుంచి పూర్తి స్థాయిలో నగదు ఉపసంహరణ (Liquidation) జరగలేదని ఆర్థిక సంస్థలు వివరించాయి. రూ. 14,132 కోట్ల విలువైన ఆస్తులను ఎస్‌బీఐకి అప్పగించినట్లు ఈడీ తెలిపినప్పటికీ, సివిల్ రికవరీలు వేరని, మోసం, నేరపూరిత కుట్రకు సంబంధించిన క్రిమినల్ ప్రాసిక్యూషన్ వేరని న్యాయస్థానానికి సమర్పించిన పత్రాల్లో పేర్కొన్నారు.

మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఆర్థిక రికవరీ జరిగినంత మాత్రాన ఎస్బీఐ, సీబీఐ, ఈడీ నమోదు చేసిన క్రిమినల్ జవాబుదారీతనం నుండి మాల్యా తప్పించుకోలేరని బ్యాంకులు ఉద్ఘాటించాయి. 2019 డిసెంబరులో జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ విచారణలను మూసివేయాలని మాల్యా దాఖలు చేసిన పిటిషన్‌లో ఎలాంటి సబ్‌స్టాన్స్ లేదని బ్యాంకింగ్ కన్సార్టియం వాదించింది. ఒకవైపు సివిల్ రికవరీలు, మరోవైపు బ్యాంక్ మోసం, కుట్ర కేసులలో ఈడీ, సీబీఐ క్రిమినల్ విచారణలు ఏకకాలంలో కొనసాగుతున్నాయి. ఈ అత్యంత కీలకమైన పిటిషన్‌పై బాంబే హైకోర్టు అక్టోబర్ 13న తదుపరి విచారణ జరిపి తీర్పు వెలువరించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+