TAC Infosec Share: స్టాక్ మార్కెట్లో కొనసాగిన బుల్ జోరుతో అనేక కంపెనీలు తమ ఇన్వెస్టర్లకు మంచి రోజులను తెచ్చిపెట్టాయి. ఈ క్రమంలో ప్రధానంగా చిన్న కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లను లాభాల్లో ముంచాయి. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ షేర్లలో వేలు పెట్టిన వారు లక్షలు రాబడిని చూశారు. అయితే ఇప్పుడు అందరి చూపు విజయ్ కేడియాకు చెందిన కంపెనీ షేర్లపై ఉంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది టీఏసీ ఇన్ఫోసెక్ అనే చిన్న కంపెనీ షేర్ల గురించే. గడచిన ఆరు నెలల కాలంలో ఈ కంపెనీ షేర్లు తమ ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రాబడులను అందించింది. దీంతో ఇన్వెస్టర్లు ఈ కాలంలో ఏకంగా 550 శాతం రిటర్న్స్ అందుకున్నారు. నేడు ఇంట్రాడేలో కంపెనీ షేర్లు రూ.685 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. వాస్తవానికి ఈ కంపెనీ ఐపీవో దేశీయ స్టాక్ మార్కెట్లోకి మార్చి 27. 2024న ప్రారంభమైంది. ఆ సమయంలో కంపెనీ ఒక్కో షేరును రూ.106 వద్ద ఇష్యూ చేయబడింది. ఐపీవోపై ప్రముఖ ఇన్వెస్టర్ విజయ్ కేడియా పందెం వేస్తూ దాదాపు 11 లక్షల షేర్లను కొనుగోలు చేశారు.

కంపెనీ షేర్లలో విజయ్ కేడియా ప్రముఖ పెట్టుబడిదారుగా కొనసాగుతున్నారు. ఆయన వ్యక్తిగత పోర్ట్ ఫోలియోలో 11,47,500 TAC ఇన్ఫోసెక్ షేర్లను హోల్డ్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా ప్రకారం కంపెనీలో 10.95 శాతం వాటాలను హోల్డ్ చేస్తున్నట్లు వెల్లడైంది. ఇదే క్రమంలో విజయ్ కేడియా కుమారుడు అంకిత్ విజయ్ కేడియా కంపెనీలో 3,82,500 షేర్లను లేదా 3.65 శాతం వాటాను కలిగి ఉన్నట్లు వెల్లడైంది. కంపెన షేరలు ఎస్ఎమ్ఈ కేటగిరీలో లిస్టింగ్ కోసం వచ్చిన సమయంలో మార్కెట్ల నుంచి రూ.29.99 కోట్లను సమీకరించింది. కంపెనీ తన ఐపీవోను మార్చి 27, 2024 నుంచి ఏప్రిల్ 2 వరకు పెట్టుబడిదారుల కోసం అందుబాటులో ఉంచబడింది.
ఐపీవో సమయంలో ఇన్వెస్టర్ల నుంచి విశేష స్పందనను పొందిన ఐపీవోలో రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 433.80 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కేటగిరీలో 768.89 సార్లు, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల విభాగం 141.29 రెట్లు సబ్‌స్క్రిప్షన్ పొందింది. ప్రస్తుతం ఐపీవో తర్వాత కంపెనీ షేర్లలో విపరీతమైన పెరుగుదలతో చాలా మంది ఇన్వెస్టర్లు పెట్టుబడి అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నేడు కంపెనీ షేర్లు 5 శాతం లోయర్ సర్క్యూట్ తాకి రూ.670.60 వద్ద ఎన్ఎస్ఈలో మధ్యాహ్నం సమయానికి ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. అలాగే స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.895.80 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.106 వద్ద ఉంది. ఈ క్రమంలో ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ మెుత్తంగా రూ.702 కోట్లుగా కొనసాగుతోంది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications