TAC Infosec Share: దేశీయంగా ఐపీవోలకు క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు. పైగా వీటిని దీర్ఘకాలంలో హోల్డ్ చేసిన ఇన్వెస్టర్లకు సూపర్ లాభాలు అందుకుంటున్నారు. ప్రస్తుతం ప్రముఖ ఇన్వెస్టర్ విజయ్ కేడియా పెట్టుబడి పెట్టిన ఐపీవో ఊహించని రాబడులను ఇన్వెస్టర్లకు అందిస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది TAC Infosec అనే కంపెనీ గురించే. 5 నెలల కిందట ఐపీవోగా మార్కెట్లోకి వచ్చిన ఈ చిన్న స్టాక్ ప్రస్తుతం మార్కెట్లో పెద్ద చర్చకు దారితీసింది. గురువారం మార్కెట్లో కంపెనీ షేర్లు 10 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. దీంతో ఒక్కో షేరు ధర రూ.737.05 స్థాయికి ఎగబాకాయి. అయితే కంపెనీ ఐపీవో ఇష్యూ సమయంలో కంపెనీ తన షేర్లను ఇన్వెస్టర్లకు ఒక్కోటి రూ.106 రేటు చొప్పున విక్రయించింది. ఈ ఐపీవోలో ప్రముఖ ఇన్వెస్టర్ విజయ్ కేడియాకు 11 లక్షల షేర్ల కంటే ఎక్కువే వాటాలు ఉన్నాయి.

టీఏసీ ఇన్ఫోసెక్ కంపెనీ తన ఐపీవోను ఈ ఏడాది మార్చి 27 నుంచి 2 ఏప్రిల్ 2024 వరకు ఇన్వెస్టర్ల కోసం తెరిచి ఉంది. అయితే లిస్టింగ్ సమయంలో స్టాక్ ధర ఒక్కోటి రూ.290 వద్ద జాబితా అయ్యాయి. బంపర్ లిస్టింగ్ తర్వాత గత నెలలో షేర్లు భారీ పెరుగుదలను చూశాయి. ఇష్యూ ధరతో పోల్చితే ప్రస్తుతం కంపెనీ షేర్ ధర 550 శాతానికి పైగా పెరిగి ఇన్వెస్టర్లను ధనవంతులుగా మార్చేసింది స్మాల్ క్యాప్ కంపెనీ. ప్రస్తుతం కంపెనీ షేర్లు తమ 52 వారాల గరిష్ఠ ధర రూ.760కి చేరువలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
ప్రముఖ భారతీయ పెట్టుబడిదారుడు విజయ్ కేడియా కంపెనీలో 11,47,500 షేర్లు ఉన్నారు. ప్రస్తుతం కంపెనీలో కేడియాకు దాదాపు 3.65 శాతం వాటా ఉందని తెలుస్తోంది. ఈ సమాచారం ఏప్రిల్ 3 వరకు ఉన్న షేర్ హోల్డింగ్ ప్యాట్రన్ ప్రకారంగా ఉంది. ఐపీవో సమయంలో ఇన్వెస్టర్ల నుంచి విశేష స్పందనను పొందిన ఐపీవోలో రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 433.80 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కేటగిరీలో 768.89 సార్లు, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల విభాగం 141.29 రెట్లు సబ్‌స్క్రిప్షన్ పొందింది. ప్రస్తుతం ఐపీవో తర్వాత కంపెనీ షేర్లలో విపరీతమైన పెరుగుదలతో చాలా మంది ఇన్వెస్టర్లు పెట్టుబడి అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..



Click it and Unblock the Notifications