Stock Ideas: బుల్లెట్ వేగంతో లాభాలిస్తున్న రెండు స్టాక్స్.. ఇన్వెస్టర్ విజయ్ కేడియా కూడా..

Stock Ideas: దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రస్తుతం కొన్ని రంగాల్లోని షేర్లు రానున్న 5-7 ఏళ్ల కాలంలో మంచి లాభాలను అందించనున్నాయి. ప్రఖ్యాత పెట్టుబడిదారుడు విజయ్ కేడియా సైతం ఇదే విషయాన్ని ఇటీవల వెల్లడించారు.

విజయ్ కేడియా ప్రకారం భవిష్యత్తులో రైల్వే, డిఫెన్స్ రంగాల్లోని షేర్లు మంచి రాబడులను అందిస్తాయని తెలుస్తోంది. ఈ రంగాలకు మంచి రోజులు ఇప్పుడిప్పుడే మెుదలయ్యాయని తెలిపారు. ఈ క్రమంలో కొచ్చి షిప్ యార్డ్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, జూపిటల్ వ్యాగన్స్, కే అండ్ పి రైల్ ఇంజన్స్, మెజగాన్ డాక్ షిప్ బుల్డర్స్, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, టిటాగర్ రైల్ సిస్టమ్స్ కంపెనీలు మంచి రాబడులను పొందవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Vijay Kedia bullish over defence, railway stocs RVNL, IRFC stocks rocking in market

ప్రస్తుతం రెండు రైల్వే స్టాక్స్ మార్కెట్లో పెట్టుబడిదారులకు లాభాలను అందిస్తూ సందడి చేస్తున్నాయి. మొదటి స్టాక్ రైల్ వికాస్ నిగమ్ (RVNL) కాగా.. రెండవది ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC). నేడు RVNL షేర్లు పెరుగుతున్నాయి. ఈ రైల్వే స్టాక్ BSEలో ఉదయం 10 గంటల సమయంలో తన 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.158ని తాకింది. ఇదే సమయంలో ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ షేర్లు రూ.57.20 వద్ద ప్రారంభమై రూ.66.50కి ఎగబాకింది. గత ఏడాది కాలంలో స్టాక్ 195 శాతం రాబడులను అందించింది. జూలై నుంచి IRFC షేర్ల ధర రూ.32.35 స్థాయి నుంచి దాదాపు రెండింతలు పెరిగింది.

ప్రస్తుతం IRFC మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.86,120 కోట్లకు చేరుకోవటంతో m-క్యాప్‌తో మొత్తం ర్యాంకింగ్‌లో 68వ స్థానంలో నిలిచింది. ఇదే క్రమంలో RVNL మార్కెట్ క్యాప్ పరిశీలిస్తే.. రూ.31,830 కోట్లుగా ఉంది. ఉదయం 10.52 గంటల సమయంలో స్టాక్ ధర 10 శాతానికి పైగా లాభంతో రూ.152.60 వద్ద ఎన్ఎస్ఈలో తన ట్రేడింగ్ కొనసాగిస్తోంది. రానున్న కాలంలో కంపెనీ షేర్ ధర రూ.180ని తాకవచ్చని అంచనాలు ఉన్నాయి.

NOTE: పైన అందించిన వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే. వీటి ఆదారంగా ఎలాంటి ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. మీ పెట్టుబడి సలహాదారులను సంప్రదించి పెట్టుబడులు చేయండి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+