హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోన్న ఎలక్ట్రిక్ వెహికిల్ స్టార్టప్‌లో ప్రముఖ తెలుగు నటుడు విజయ్ దేవరకొండ పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పటికే రౌడీ బ్రాండ్‌తో బట్టల వ్యాపారంలోకి అడుగుపెట్టిన ఈ క్రేజీ హీరో ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికిల్స్(EV) తయారీ రంగంలోకి అడుగు పెట్టారు. నిలకడైన, పర్యావరహిత ప్రత్యామ్నాయాలు మనకు బంగారు భవిష్యత్తును అందివ్వగలవని తాను గట్టిగా నమ్ముతున్నానని, వాట్స్ అండ్ వోల్ట్స్ ద్వారా ఎలక్ట్రిక్ బైక్స్, సైకిల్స్, స్కూటీలను మార్కెట్లోకి తీసుకు వస్తున్నామని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.

విజయ్ దేవరకొండ విజ్ఞప్తి
అనవైన, పరిమితస్థాయి ప్రయాణం కోసం విద్యుత్ ఆధారిత వాహనాలను ఉపయోగించాలని విజయ్ దేరవకొండ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విజయ్ దేవరకొండ ఇన్వెస్ట్ చేసిన వాట్స్ అండ్ వోల్ట్స్ 2021 నుండి తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. శుక్రవారం తెలంగాణలో EV పాలసీని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే అతడు ఎంత మేర పెట్టుబడులు పెట్టనున్నారో తెలియరాలేదు. కొత్త ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని మంత్రి కేటీ రామారావు ప్రారంభించారు. ఈ కొత్త విధానం 2020 నుండి 2030 అమల్లో ఉంటుంది.

ప్రత్యేక ఛార్జింగ్ కేంద్రం
శుక్రవారం మంత్రులు కేటీ రామారావు, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ విద్యుత్ వాహనాలు-ఇంధన నిల్వల పాలసీ-2020-30ని ఆవిష్కరించారు. ఈ విధానాలకు అనుగుణంగా EV తయారీ, వినియోగానికి తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుంది. పట్టణాల్లో వాహనాలకు ప్రత్యేక ఛార్జింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేయనున్నారు.
జాతీయ రహదారుల పక్కన ప్రతి 50 కి.మీ. చొప్పున ఛార్జింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. EV, ఇంధన నిల్వలకు కొత్త విధానం అమలు చేస్తారు. 2020-2030 వరకు EV తయారీ, వినియోగంపై విధానమైన ప్రకటన చేశారు. తెలంగాణను EV హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో కొత్త విధానాన్ని ప్రకటించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా చందన్‌వెల్లి, మహబుబ్‌నగర్‌లోని దివిటీపల్లి క్లస్టర్లలో EV తయారీ యూనిట్లు ఏర్పాటు కానున్నాయని కేటీఆర్ తెలిపారు. EV బస్సుల తయారీ యూనిట్లను ఏర్పాటు చేస్తామన్నారు. EV తయారీ సంస్థల కోసం వారం రోజుల్లో మొబిలిటీ క్లస్టర్‌ను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. వాయు కాలుష్యాన్ని నివారించేందుకు EV తయారీని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత పాలసీలో దాదాపు రెండున్నర లక్షల విద్యుత్తు వాహనాలకు రాయితీలు ప్రకటించామని, కేబినేట్‌లో చర్చించి వాటి సంఖ్యను పెంచుతామన్నారు.

14,650 మందికి ఉపాధి
ఎలక్ట్రికల్ వెహికిల్ పాలసీ విడుదల సందర్భంగా ప్రభుత్వం ఐదు విద్యుత్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కంపెనీలు రాష్ట్రంలో రూ.3,200 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. వీటి ద్వారా 14,650 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇందులో ప్రముఖ విద్యుత్తు బస్సుల తయారీ సంస్థ మైత్రా ఎనర్జీ రూ.2 వేల కోట్ల పెట్టుబడితో పాటు 6,750 మంది ఉపాధి కల్పించనుంది. మరో బస్సుల తయారీ సంస్థ రూ.300 కోట్లు ఇన్వెస్ట్ చేయడం ద్వారా 3,500 మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. మరో మూడు సంస్థలతోను ఒప్పందం కుదిరింది.
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications