Zomato డెలివరీ బాయ్‌పై దాడి.. హోలీ రోజు నాందేడ్‌లో దారుణం.. వైరల్ వీడియో
Zomato: డెలివరీ బాయ్స్ పై దాడులు జరగటం ఇటీవల వార్తల్లో తరచుగా కనిపిస్తోంది. తాజాగా మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఒక ఘటన చోటుచేసుకుంది. హోలీ పండుగ సందర్భంగా జొమాటో డెలివరీ బాయ్‌పై కొందరు దాడి చేశారు.
దాడి జరిగిన కొన్ని రోజుల తర్వాత సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జొమాటో బాయ్ ఘటనపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. దర్యాప్తు చేపట్టిన తర్వాత నలుగురిపై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న వీడియోలో ఫిబ్రవరి 7న నిందితుల సమూహం జొమాటో బాయ్ పై దాడి చేయడం ప్రారంభించినప్పుడు న్యాయ విద్యార్థి అమ్రాన్ తంబోలి తన ఫోన్ చెక్ చేసుకుంటూ వీడియోలో కనిపించాడు.
సదరు లా విద్యార్థిపై దుండగులు దాడి చేసి, తన్ని, చెక్క దుంగతో దాడి చేశారు. అతను ఒక ఆర్డర్‌ను డెలివరీ చేసి.. తన సెల్‌ఫోన్‌లో మరో ఆర్డర్‌ను తనిఖీ చేసుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తనపై దాడి జరిగటంపై సదరు జొమాటో డెలివరీ బాయ్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయ్యే వరకు నిందితులపై పోలీసులు ఎటువంటి చర్య తీసుకోలేదని తెలుస్తోంది.

లా కోర్సులో మొదటి సంవత్సరం చదువుతున్న తంబోలి.. తన చదువుకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు జొమాటో డెలివరీ ఉద్యోగంలో చేరాడు. రైతు బిడ్డ అయిన తంబోలీ గడ్డంపై నిందితులు రంగులు పూయగా.. వాటితో నుదుటిపై తిలకం పెట్టారని చెప్పాడు. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించి నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరికొందరిని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications