BSNL 5G: మార్కెట్లోకి బీఎస్ఎన్ఎల్ 5జీ సిమ్‌కార్డ్..! ఇక Vi, Jio, Airtelకి వణుకే..
BSNL 5G: దేశంలోని టెలికాం రంగంలో పెను మార్పులు మెుదలయ్యాయి. ఇప్పటికే Vi, Jio, Airtel సంస్థలు భారీగా ఇటీవల టారిఫ్ రేట్లను పెంచటంతో అందరి చూపు బీఎస్ఎన్ఎల్ వైపు మళ్లింది. చాలా మంది మెుబైల్ వినియోగదారులు ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ కి మారుతున్నారు.
ప్రస్తుత కాలంలో ప్రతి ఇంట్లో ఉన్న కుటుంబసభ్యులందరూ తలొక మెుబైల్ ఫోన్ కలిగి ఉంటున్నారు. దీంతో వాటి నెలవారీ ఖరీదైన రీఛార్జీలు సగటు వినియోగదారుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కేవలం రీఛార్జీలకే ఏడాదికి వేల రూపాయలు వెచ్చిస్తున్నారు. ఈ క్రమంలో బీఎస్ఎన్ఎల్ సేవలను బలోపేతం చేయటంతో పాటు 4జీ, 5జీ కనెక్టివిటీ ఏర్పాటుకు టాటాలు సహకారం అందిస్తున్నారు.

ఈ క్రమంలో వినియోగదారులకు పూణే నుంచి పెద్ద శుభవార్త వచ్చింది. BSNL కార్యాలయంలోని అధికారులు పెద్ద ట్రేలో బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్ కార్డును చూపించారు. ఒక అధికారి BSNL 5G అని వ్రాసిన సిమ్ కార్డ్‌ని చూపించాడు. BSNL నుండి ఇంకా అధికారిక సమాచారం లేనప్పటికీ ఈ వీడియో BSNL 5G వినియోగదారులకు త్వరలో అందుబాటులోకి రాబోతుందని సూచిస్తోంది. BSNL అధికారి కిషోర్ గావ్లీ ఈ వీడియోలో పూణే జిల్లాలో 5G కార్డ్‌ను ప్రారంభిస్తున్నట్లు కనిపించారు. BSNL 4G సేవను ప్రారంభించలేదు. కాబట్టి 5G నేరుగా వస్తోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా కంపెనీలు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బీఎస్ఎన్ఎల్ హోల్డింగ్ ప్రారంభంలో 700MHz బ్యాండ్‌ని ఉపయోగిస్తుంది. అలాగే కన్నాట్ ప్లేస్ -దిల్లీ, గవర్నమెంట్ ఇండోర్ ఆఫీస్ -బెంగళూరు, గవర్నమెంట్ ఆఫీస్ -బెంగళూరు, సంచార్ భవన్ -దిల్లీ, JNU క్యాంపస్ దిల్లీ, IIT-దిల్లీ, హైదరాబాద్‌లో 5Gని పరీక్షించనుంది. కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య షిండే సి-డాట్ క్యాంప్‌లో BSNL 5G కాల్‌లను అనుభవించారు. కాల్ చేస్తున్నప్పుడు జ్యోతిరాదిత్య షిండే దగ్గర నిలబడిన వ్యక్తి BSNL 5Gలో కాల్ చేసినట్లు చెప్పాడు.


Click it and Unblock the Notifications