Vibhor Steel Tubes: రానున్న వారంలో మరో ఐపీవో పెట్టుబడిదారుల కోసం తెరవబడుతోంది. స్టీల్ వ్యాపారంలో ఉన్న కంపెనీ షేర్ల కోసం ఇప్పటికే గ్రేమార్కెట్లో పెద్ద యుద్ధమే జరుగుతోంది. దీంతో గ్రేమార్కెట్ ప్రీమియం తుఫాను వేగంగా పెరిగిపోతోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది విభోర్ స్టీల్ టూబ్స్ లిమిటెడ్ కంపెనీ ఐపీవో గురించే. వచ్చే వారం నుంచి ఇన్వెస్టర్లకు పెట్టుబడి కోసం తెరవబడుతుంది. ఫిబ్రవరి 13 - 15 వరకు ఈ ఇష్యూలో ఇన్వెస్టర్లు పందెం వేయవచ్చు. దీనికోసం కంపెనీ తన షేర్ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.141 నుంచి రూ.151గా నిర్ణయించింది. విభోర్ స్టీల్ టూబ్స్ లాట్ పరిమాణాన్ని 99 షేర్లుగా నిర్ణయించింది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.72.17 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. ఇందులో పూర్తిగా తాజా ఈక్విటీ షేర్ల ఇష్యూ ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కంపెనీ షేర్లు ప్రస్తుతం గ్రేమార్కెట్లు దుమ్ముదులిపేస్తున్నాయి. గ్రేమార్కెట్లో ఒక్కో షేరు రూ.101 ప్రీమియం రేటు పలుకుతున్నాయి. మార్కెట్లలో జాబితా రోజు వరకు ఇదే కొనసాగితే లిస్టింగ్ ధర రూ.252 వరకు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే ఫిబ్రవరి 20న పెట్టుబడిదారులు మెుదటి రోజున ఏకంగా 67 శాతం వరకు భారీ లాభాన్ని పొందనున్నారని తెలుస్తోంది.
వైభోర్ స్టీల్ ట్యూబ్స్ లిమిటెడ్ అనేది మైల్డ్ స్టీల్/కార్బన్ స్టీల్ ERW బ్లాక్ అండ్ గాల్వనైజ్డ్ పైపులు, హాలో స్టీల్ పైపులు, కోల్డ్ రోల్డ్ స్టీల్ స్ట్రిప్స్, కాయిల్స్ తయారీ ఎగుమతి వ్యాపారంలో కొనసాగుతోంది. దేశంలో కంపెనీ దాదాపు 20 ఏళ్లుగా తన వ్యాపార ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. భారతదేశంలో హెవీ ఇంజనీరింగ్ రంగానికి స్టీల్ పైప్స్ అండ్ ట్యూబ్స్ ఉత్పత్తి చేస్తోంది. ఏప్రిల్ 1, 2023న వైభోర్ స్టీల్ ట్యూబ్స్ జిందాల్ పైప్స్‌తో ఒప్పందాన్ని పునరుద్ధరించింది. జిందాల్ స్టార్ బ్రాండ్ క్రింద జిందాల్ పైప్స్ దాని వినియోగదారులకు పూర్తయిన వస్తువులు తయారు చేయబడతాయి. ప్రమోటర్లు విజయ్ కౌశిక్ HUF, విభోర్ కౌశిక్, విజయ్ లక్ష్మి కౌశిక్, విజయ్ కౌశిక్ ప్రస్తుతం 1,32,46,500 ఈక్విటీ షేర్లను కలిగి ఉన్నారు.


Click it and Unblock the Notifications