ప్రముఖ తెలుగు హీరో మోహన్ బాబు అతని కొడుకు మంచు మనోజ్ మధ్య గొడవ తార స్థాయికి చేరింది. మనోజ్ తన సెక్యూర్టీ టీంతో హైదరాబాద్‌లోని జల్‌పల్లిలో మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు చూపుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది, అంతేకాదు ఈ వీడియో పెద్ద దుమారమే తెలిపింది. మోహన్ బాబు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ రాచకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా మనోజ్, మౌనిక తన ఆస్తిని లాక్కోవడానికి ప్రయత్నించారని మోహన్ బాబు ఆరోపించారు. తన ఇంటిపై దాదాపు పది మంది వ్యక్తులు దాడి చేశారని మనోజ్ పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌లో విడిగా ఫిర్యాదు చేశారు.
కుటుంబ కలహాలు
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి వచ్చిన సమాచారం ప్రకారం మనోజ్ అతని సోదరుడు విష్ణు మధ్య విభేదాలు సంవత్సరాల క్రితం ప్రారంభమైందని అయితే ఇప్పుడు మనోజ్ ఇంకా మోహన్ బాబు ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేయడంతో ఈ గొడవ భహిరంగంగా మారింది. గతంలో విష్ణు తన తండ్రి మోహన్ బాబు ఇంట్లో ఉంటుండగా, మనోజ్ విడిగా ఉండేవాడు. 2023లో విష్ణు తన కుటుంబంతో కలిసి దుబాయ్‌కి వెళ్లాడు. ఏది ఏమైనప్పటికీ ఆస్తి పంపకాలు, కుటుంబ వ్యాపార విషయాలపై ఇద్దరు కొడుకుల మధ్య వివాదాలు సంవత్సరాలుగా ముదురుతున్నాయి.

మోహన్ బాబు ఆస్తుల విలువ
ఒక తెలుగు వెబ్ సైట్ ప్రకారం 2022లో మోహన్ బాబు మొత్తం ఆస్తుల విలువ రూ. 589 కోట్లకు పైమాటే. మోహన్ బాబు సినిమాల ద్వారా ఎక్కువగా సంపాదిస్తున్నప్పటికీ మోహన్ బాబు విశ్వవిద్యాలయం, శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌తో సహా చాల విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. విష్ణు మోహన్ బాబు యూనివర్శిటీ ప్రో-ఛాన్సలర్, న్యూయార్క్ అకాడమీ & స్ప్రింగ్‌బోర్డ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఛైర్మన్ అండ్ ఫౌండర్ కూడా. మరోవైపు మనోజ్‌కు కుటుంబ వ్యాపారాలలో ఎటువంటివి అప్పగించలేదు, ఇదే ఈ వివాదాలకు ముఖ్య కారణంగా చెబుతున్నారు.
సినీ పరిశ్రమలో మోహన్ బాబుకి శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థ ఉంది. అయితే మరో రెండు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఇంకా మంచు ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉన్నాయి. విష్ణు చేతుల్లో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఉండగా, మంచు ఎంటర్‌టైన్‌మెంట్ లక్ష్మికి దక్కింది. మనోజ్ 2019లో తన సొంత ప్రొడక్షన్ బ్యానర్ MM ఆర్ట్స్‌ని స్థాపించాడు, దానిని తన తండ్రి నుండి ఎలాంటి సపోర్ట్ లేకుండా ప్రారంభించారు. MM ఆర్ట్స్ ఆధ్వర్యంలో అహం బ్రహ్మాస్మి అనే ప్రాజెక్ట్ చేయగా అయితే ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది చివరికి ప్రొడక్షన్ హౌస్ విజయం సాధించలేదు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications