15 నిమిషాల్లో రూ.400 కోట్లు లాభం.. అదరగొడుతున్న వెటరన్ ఇన్వెస్టర్..
Rekha Jhunjhunwala: స్టాక్ మార్కెట్ అనగానే మనలో చాలా మంది అదొక బెట్టింగ్ అని అనుకుంటుంటారు. కానీ ఆ భావన పూర్తిగా తప్పు. ఎందుకంటే గుడ్డిగా డబ్బులు సంపాదించటం స్టాక్ మార్కెట్లలో అసంభవం. దీనికోసం చాలా రీసెర్చ్ చేయటంతో పాటు కొన్ని ఫండమెంటల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది.
దేశంలో చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు కొంత మంది పేరుగాంచిన ఇన్వెస్టర్ల పోర్ట్ ఫోలను అనుకరిస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది గతంలో బిగ్‌బుల్ రాకేష్ జున్‌జున్‌వాలాను ఫాలో అయ్యేవారు. ఆయన మరణం తర్వాత ఇప్పుడు ఆమె భార్య రేఖ జున్‌జున్‌వాలా పెట్టుబడులను చాలా మంది గమనిస్తున్నారు.

ఈ క్రమంలో ఆమె సోమవారం తెల్లవారుజామున జరిగిన 15 నిమిషాల ట్రేడింగ్ లో ఏకంగా రూ.400 కోట్లను సంపాదించారు. ఆమె పోర్ట్ ఫోలియోలోని టాటా మోటార్స్, టైటాన్స్ షేర్లలో బలమైన బుల్ జోరు కొనసాగటంతో ఊహించని విధంగా లాభాలను ఆర్జించారు. జేఎల్ఆర్ సేల్స్ మంచి వృద్ధిని నమోదు చేయటంతో టాటా మోటార్స్ షేర్లు మార్కెట్లో భారీగా లాభపడ్డాయి. టైటాన్ విక్రయాలు ఏడాది ప్రతిపధికన దాదాపు 25 శాతం వృద్ధిని నమోదు చేసింది.
ప్రీ ట్రేడింగ్ సమయంలో టైటాన్ స్టార్ ఒక్కొక్కటి రూ.50.25 మేర పెరిగాయి. ఇందులో రేఖ 4,58,95,970 షేర్లను కలిగి ఉన్నట్లు అక్టోబర్-డిసెంబర్ త్రైమాసిక హోల్డింగ్ సమాచారం ప్రకారం తెలుస్తోంది. అంటే ఈ కంపెనీల షేర్ల ద్వారా ఆమె దాదాపు రూ.230 కోట్లను కేవలం 15 నిమిషాల్లోనే ఆర్జించారు.
ఇదే క్రమంలో మరో టాటా గ్రూప్ కంపెనీ అయిన టాటా మోటార్స్‌లో రేఖ 5,22,56,000 షేర్లను కలిగి ఉన్నారు. ఈ క్రమంలో ఉదయం మార్కెట్ ప్రీ ఓపెనింగ్ సమయంలో షేర్ ఒక్కొక్కటి రూ.32.75 మేర లాభపడటంతో ఆమె రూ.170 కోట్లను ఆర్జించారు.


Click it and Unblock the Notifications