Ambuja Cement Shares: అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన ఎక్కువగా రిటైల్ ఇన్వెస్టర్లలో ఉంది. ప్రధానంగా అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ అదానీ గ్రూప్ స్టాక్స్ తిరిగి క్రమంగా పుంజుకున్న సంగతి తెలిసిందే. దీనివెనుక అండగా నిలిచిన వెటరన్ ఇన్వెస్టర్ తాజాగా మరో భారీ పెట్టుబడితో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.
వివరాల్లోకి వెళితే గౌతమ్ అదానీ గ్రూప్ ప్రమోటర్లు శుక్రవారం ట్రేడింగ్ రోజున తమ సిమెంట్ వ్యాపారమైన అంబుజా సిమెంట్స్‌లో 2.8 శాతం వాటాను ఓపెన్ మార్కెట్ ట్రాన్సాక్షన్ ద్వారా విక్రయించారు. ఈ డీల్ పూర్తి విలువ రూ.4,250 కోట్లుగా తెలుస్తోంది. బ్లాక్ డీల్ ద్వారా చేతులు మారిన షేర్లను GQG పార్టనర్స్ కొనుగోలు చేసింది. వాస్తవానికి రెగ్యులేటరీ నిబంధనలకు అనుగుణంగా సర్దుబాటులో భాగంగా అంబుజా సిమెంట్స్ ప్రమోటర్లు వాటాలను విక్రయించినట్లు వెల్లడైంది.

ఈ క్రమంలో రాజీవ్ జైన్-మద్దతుగల GQG పార్టనర్స్ అంబుజా సిమెంట్స్‌లో రెండు విడతలుగా 4.39 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. రెండు వేర్వేరు లావాదేవీలలో బల్క్ డీల్స్ ద్వారా మెుత్తం కంపెనీలో 1.78 శాతం వాటాను దక్కించుకుంది. ఈ క్రమంలో ఒక్కో షేరును రూ.625.50 సగటు ధరకు డీల్ జరిగింది. ఈ రెండు ఉమ్మడి డీల్ విలువ రూ.2,746.79 కోట్లుగా ఉంది. ఈ పెద్ద ఒప్పందం తర్వాత అంబుజా సిమెంట్స్‌లో ఫోర్ట్ లాడర్‌డేల్ ఆధారిత అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ GQG పార్టనర్స్ వాటా 1.35 శాతం నుంచి 3.13 శాతానికి పెరిగింది. అదానీ గ్రూప్ యాజమాన్యంలోని అంబుజా సిమెంట్స్ వాటా విక్రయంలో US ఆధారిత బోటిక్ పెట్టుబడి సంస్థ అతిపెద్ద కొనుగోలుదారుగా అవతరించింది.
ఎన్ఎస్ఈలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అంబుజా సిమెంట్స్ ప్రమోటర్ హోల్డెరిండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ 6.79 కోట్ల షేర్లను విక్రయించింది. ఒక్కో షేరు సగటు ధర రూ.625.50కి విక్రయించడంతో లావాదేవీ విలువ రూ.4,250.64 కోట్లకు చేరుకుంది. ఒప్పందం తర్వాత అంబుజా సిమెంట్స్‌లో హోల్డరెండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ వాటా 50.90 శాతం నుంచి 48.1 శాతానికి తగ్గింది. అలాగే అంబుజా సిమెంట్స్ ప్రమోటర్ల ఉమ్మడి వాటా 70.33 శాతం నుంచి 67.53 శాతానికి తగ్గింది. ఈ క్రమంలో శుక్రవారం మార్కెట్ల ముగింపు సమయానికి రూ.633.55 వద్ద ఉన్నాయి.
ఎవరెవరు కొన్నారు..??
ఎన్ఎస్ఈ డేటా ప్రకారం అదానీ గ్రూప్ సిమెంట్ కంపెనీలో వాటాలను యాక్సిస్ మ్యూచువల్ ఫండ్స్, బరోడా బీఎన్పీ పరిబాస్ మ్యూచువల్ ఫండ్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్స్, ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్స్, మిరే అసెట్ మ్యూచువల్ ఫండ్స్, కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, నేషనల్ పెన్షన్ సిస్షమ్ ట్రస్ట్, మోర్గన్ స్టాన్లీ, వాన్‌గార్డ్ గ్రూప్, నార్వే ప్రభుత్వ పెన్షన్ ఫండ్ అంబుజా సిమెంట్స్ కంపెనీలో వాటాలను కొనుగోలుచేసిన లిస్టులో ఉన్నాయి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications