IT News: ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తోంది. ఓపెన్ ఏఐ రూపొందించిన చాట్ జీపీటీ అందుబాటులోకి రావడంతో ఈ టెక్నాలజీ హాట్ టాపిక్ గా మారింది. భవిష్యత్తులో మానవ ప్రమేయం లేకుండా ఉద్యోగాలను ఇది భర్తీ చేస్తుందని పలువురు నిపుణులు ఇప్పటికీ హెచ్చరిస్తున్నారు. తద్వారా కంపెనీలకు ఖర్చులు తగ్గుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కానీ ఇదే సమయంలో బయటికి వచ్చిన ఒక న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.
AI టెక్నాలజీ పై అనుభవం ఉన్న నిపుణులను నియమించుకోవడం చాలా కష్టం అంటూ 'పెర్‌ప్లెక్సిటీ' అనే ఏఐ స్టార్టప్ CEO చెప్పుకొచ్చారు. తనకు ఎదురైన ఓ చేదు సంఘటన ను గుర్తు చేసుకున్నారు. తాను మెటాలో పని చేస్తున్న ఓ సీనియర్ రీసెర్చర్‌ని నియమించుకోవాలని ప్రయత్నించినట్లు చెప్పారు. అయితే ఆ వ్యక్తి ఇచ్చిన సమాధానానికి తనకు మైండ్ బ్లాక్ అయిందన్నాడు. ఎందుకంటే మీ దగ్గర 10 వేల H100 GPU ప్రాసెసర్లు ఉన్నప్పుడు నాకు చెప్పండి, అప్పుడు ఆలోచిస్తాను అని చెప్పినట్లు పేర్కొన్నారు.

దీంతో ఆ టెక్నాలజీకి సంబంధించిన నిపుణులను వెతికి పెట్టుకోవడం ఇప్పుడు పెద్ద సవాలుగా మారినట్లు పేర్కొన్నారు. మెటా, గూగుల్ దగ్గర సంస్థలు తమ మోడళ్లకు ట్రైనింగ్ ఇచ్చేందుకు ఈ ప్రాసెసర్లను వినియోగిస్తుంటాయి. వీటి ధరలు అందుబాటులో ఉండవు. బిలియన్ల కొద్దీ ఖర్చు చేసినా వీటిని ఆర్డర్ చేసిన తర్వాత సప్లై చేసేందుకు ఎన్వీడియాకు 5 నుంచి 10 ఏళ్ల సమయం పడుతుంది.
పరిమిత నిధులు కలిగే స్టార్టప్స్‌ను నిపుణుల కొరత వేధిస్తోందని ఆయన పేర్కొన్నారు. దీంతో చాట్ జీపీటీ-4 సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. తమ Q&A ప్రశ్నలకు జవాబులు ఇవ్వగలిగే శక్తినిచ్చే భాష నమూనాను రూపొందించగలిగిన వ్యక్తులను ఎన్నుకోవడం అత్యంత కష్టంతో కూడుకున్న పని. ఏదో ఒక విధంగా ప్రాసెసర్లను పొందగలిగినప్పటికీ, AI వేగవంతమైన వృద్ధి కారణంగా అవి కాస్త వెనకబడిపోతాయి అని అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications