Layoff: గత రెండేళ్లుగా ITతో పాటు వివిధ రంగాలను కుదిపేస్తున్న పేరు లేఆఫ్స్. ఏరోజు, ఎక్కడ ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఓ పక్కన పూర్తిస్థాయిలో నైపుణ్యాలు లేక ఉద్యోగార్థులు, మరోపక్క ఖర్చులు తగ్గించుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్న కంపెనీలు మధ్య పోటీ ఏర్పడింది.
అంతర్జాతీయంగా అలుముకున్న ఆర్థిక అనిశ్చితికి ఉత్పాదక AI కూడా తోడు కావడంతో జాబ్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం పడింది. సెలవుల సీజన్, కొత్త ఏడాది తేడా లేకుండా ఆయా కంపెనీలు తమ సిబ్బందికి ఉద్వాసన పలుకుతున్నాయి. కాగా గత రెండేళ్లలో ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం కాయం.

ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్‌లతో సహా టెక్ కంపెనీలు గత రెండేళ్లలో 4 లక్షల 25 వేల కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించాయి. ఇక దేశంలో 36 వేల కంటే ఎక్కువ మందిపై కంపెనీలు వేటు వేశాయి. అయితే అవి ఇక్కడితో ఆగలేదు. layoff.fyi వెబ్‌సైట్ కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ ఏడాది 1,178 కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల 60 వేల 771 మంది సిబ్బందిని తొలగించినట్లు layoff.fyi డేటా వెల్లడించింది. టెక్ సెక్టార్ ఉద్యోగాల కోతలను ట్రాక్ చేసే ఈ వెబ్‌సైట్ డేటా ప్రకారం.. 2022లో 1,061 టెక్ కంపెనీలు లక్షా 64 వేల 769 మంది సిబ్బందిని ఇంటికి పంపించాయి. అంటే గత రెండేళ్లలో దాదాపు రోజుకి 582 మంది, గంటకు 24 మంది కొలువు కోల్పోయారు.


Click it and Unblock the Notifications