IPO Listing: ఐపీవో అప్పర్ సర్క్యూట్.. తొలిరోజే ఇన్వెస్టర్ల సంపద డబుల్..

Veritaas Advertising IPO: నేడు స్టాక్ మార్కెట్ల పనితీరు నిరాశ పరుస్తున్నప్పటికీ.. ఐపీవోలు మాత్రం తగ్గేదే లే అన్నట్లుగా కొనసాగుతున్నాయి. నేడు మార్కెట్లో విజయవంతంగా జాబితా అయిన ఐపీవో లిస్టింగ్ తర్వాత భారీ కొనుగోళ్లతో అప్పర్ సర్క్యూట్ తాకింది.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది వెరిటాస్ అడ్వర్టైజింగ్ ఐపీవో గురించే. నేడు కంపెనీ షేర్లు ప్రీమియం ధరకు మార్కెట్లోకి అడుగుపెట్టాయి. ఇన్వెస్టర్ల నుంచి కనిపించిన కొనుగోళ్ల కోలాహలంతో షేర్లలో విపరీతమైన లిస్టింగ్ ఉంది. వెరిటాస్ అడ్వర్టైజింగ్ షేర్లు నేడు ఒక్కోటి రూ.275 వద్ద లిస్ట్ అయ్యాయి. వాస్తవానికి కంపెనీ ఇష్యూ గరిష్ఠ ధర రూ.114 కంటే ఇది 144 శాతం ప్రీమియం రేటు వద్ద మార్కెట్లోకి అడుగుపెట్టాయి. దీనికి తోడు లిస్టింగ్ తర్వాత కంపెనీ షేర్లు మార్కెట్లో కొనుగోళ్ల కోలాహలంతో 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకి ఇంట్రాడేలో గరిష్ఠంగా రూ.288.75 స్థాయికి చేరుకున్నాయి.

Veritaas Advertising IPO locked in upper circuit gave 100 return to investors on first day

ఎస్ఎమ్ఈ కేటగిరీలో మార్కెట్లోకి వచ్చిన ఐపీవో రిటైల్ ఇన్వెస్టర్ల కోసం మే 13న తెరుచుకుంది. తాజా ఐపీవో నుంచి కంపెనీ మార్కెట్ల నుంచి రూ.8.48 కోట్లను సమీకరించింది. ఇష్యూ మూడు రోజుల సమయంలో ఐపీవో ఏకంగా 621.62 సార్లు సబ్‌స్క్రిప్షన్ పొందింది. ఐపీవో దరఖాస్తులను పరిశీలిస్తే.. రిటైల్ ఇన్వెస్టర్లు 989.44 రెట్లు, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు 629.56 రెట్లు, QIB కేటగిరీ ఇన్వెస్టర్లు 102.41 రెట్లు ఐపీవోకు దరఖాస్తులు చేసుకున్నారు.

2018లో స్థాపించబడిన వెరిటాస్ అడ్వర్టైజింగ్ సంస్థ పూర్తి-సేవ ప్రకటనల ఏజెన్సీ. ఇది బహుళ ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృత శ్రేణి 360-డిగ్రీ మార్కెటింగ్ పరిష్కారాలను అందిస్తుంది. కంపెనీకి పశ్చిమ బెంగాల్, గౌహతి, షిల్లాంగ్‌లలో అడ్వర్టైజింగ్ స్పేస్‌లు ఉన్నాయి ఇది అరుదైన మీడియా యాజమాన్యంలోని మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ ఏజెన్సీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అలాగే కంపెనీకి దిల్లీ, ముంబై, పూణేలలో సైతం కార్యకలాపాలు ఉన్నాయి. కంపెనీ ఐపీవో ద్వారా సేకరించిన సొమ్మును దిల్లీ, ముంబై, పూణే, పశ్చిమ బెంగాల్, అసోంలలో వ్యాపారాన్ని విస్తరించేందుకు వినియోగించాలని నిర్ణయించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+