IPO Multibagger: ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా కంపెనీలు అట్టర్ ఫ్లాప్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. వాటి వల్ల చాలా మంది కస్టమర్లు తమ పెట్టుబడల సొమ్మును కోల్పోయారు. ఇలాంటి మార్కెట్ పరిస్థితుల్లో నాలుగు నెలల కిందట వచ్చిన ఒక ఐపీవో మాత్రం ఇన్వెస్టర్లకు ఊహించని రాబడులను అందిస్తోంది.

కంపెనీ వివరాలు..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది వీనస్ పైప్స్ అండ్ ట్యూబ్స్ కంపెనీ గురించే. ఈ ఐపీవో నాలుగు నెలల కిందట మే 24న మార్కెట్లో లిస్ట్ అయింది. ఇష్యూ సమయంలో కంపెనీ షేర్ ధర రూ.326గా ఉంది. అప్పట్లో 4 శాతం ప్రీమియంతో రూ.337.50 కు జాబితా చేయబడింది. ఈ క్రమంలో స్టాక్ 92 శాతం పెరిగింది. ఈ రోజు స్టాక్ ధర బీఎస్ఈలో రూ.628.70గా ఉంది.

బ్రోకరేజ్ అంచనాలు..
స్టాక్ తాజాగా 52 వరాల గరిష్ఠ ధర అయిన రూ.652ను తాకింది. రానున్న కాలంలో కూడా కంపెనీ షేర్ ధర తన పరుగును కొనసాగిస్తుందని సెంట్రమ్ బ్రోకరేజ్ అంచనా వేసింది. అలా స్టాక్ కు రూ.764 స్థాయికి చేరుకుంటుందని వెల్లడిస్తూ BUY రేటింగ్ అందించింది. కంపెనీ ప్రస్తుతం దేశంలో రెండవ అతిపెద్ద తయారీదారుగా అవతరించిందని బ్రోకరేజ్ వెల్లడించింది. ప్రస్తుతం కంపెనీ EBITDA మార్జిన్ రత్నమణి పైప్స్ కంటే తక్కువగా ఉందని వెల్లడించింది.

వీనస్ కంపెనీ వ్యాపారం..
IPO నుంచి సేకరించిన నిధులను కంపెనీ ప్రాజెక్ట్‌ల కోసం ఉపయోగిస్తోంది. వీనస్ పైప్స్ & ట్యూబ్స్ గుజరాత్ కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ. ఇది స్టెయిన్‌లెస్ స్టీల్ పైప్స్, ట్యూబ్‌ల తయారీ, ఎగుమతి వ్యాపారంలో నిమగ్నమై ఉంది.ప్రస్తుతం కంపెనీ కెమికల్స్, ఇంజనీరింగ్, ఫెర్టిలైజర్స్, ఫార్మాస్యూటికల్స్, పవర్, ఫుడ్ ప్రాసెసింగ్, పేపర్, ఆయిల్ అండ్ గ్యాస్ వంటి రంగాల్లోని కంపెనీల అవసరాల కోసం వీనస్ బ్రాండ్ పేరుతో ఉత్పత్తులను సరఫరా చేస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications