కరోనా ఎఫెక్ట్: ఆ స్టార్టప్ లకు పెరుగుతున్న డిమాండ్!

కరోనా... కరోనా... కరోనా... ప్రపంచమంతా ముక్త కంఠంతో పఠిస్తున్న ఏకైక మంత్రం ఇదే. చైనా లో మొదలైన మాయదారి మహమ్మారి, ప్రపంచాన్ని వణికిస్తోంది. ముఖ్యంగా అగ్ర రాజ్యం అమెరికా అయితే చిగురుటాకులా వణికిపోతోంది. అత్యంత శక్తివంతమైన, శత్రు దుర్భేద్యమైన అమెరికా... ఒక చిన్న వైరస్ దెబ్బకు కకావికలం అవటం ప్రపంచం మొట్టమొదటి సారి చూస్తోంది. ఇప్పటివరకు ఆ దేశానికి ఇంతలా ప్రాణ నష్టం కలిగించిన మరో ఉపద్రవం రాలేదంటే అతిశయోక్తి కాదు. ఇదిలా ఉండగా... ప్రపంచమంతా ఇప్పుడు ఇండ్లకే పరిమితం అవుతుండటంతో ఆహార ధాన్యాలకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది.

ఇండ్లలోనే అధిక సమయం కేటాయిస్తున్న ప్రజలు ఎప్పుడూ ఎదో ఒక ఆహారం తీసుకుంటూ సాధారణ పరిస్థితుల కంటే అధికంగా ఆహార పదార్థాలను వినియోగిస్తున్నారు. దీంతో మన దేశంలోనే కాకుండా... ప్రపంచవ్యాప్తంగా ఆహార ధాన్యాలకు డిమాండ్ పెరిగిపోతోంది. ఇది కాస్తా ఈ రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న స్టార్టుప్ కంపెనీలకు వరంగా మారుతోంది. ఇప్పటివరకు పెద్దగా పట్టించుకోని ఇన్వెస్టర్లు, ఇప్పుడు ఫుడ్ స్టార్టుప్ ల వైపు తమ దృష్టి మరల్చారు.

రూ 300 కోట్ల నిధుల సమీకరణ...

రూ 300 కోట్ల నిధుల సమీకరణ...

ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ సప్లై చైన్, రైతులకు పంటల ఉత్పాదకత పెంచే సోలుషన్స్ అందించే స్టార్టుప్ కంపెనీలకు ఈ మధ్య డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ ఏడాది లో ఇప్పటికే సుమారు 6 అగ్రి టెక్ స్టార్టుప్ కంపెనీలు సంయుక్తంగా సుమారు రూ 300 కోట్ల (45 మిలియన్ డాలర్లు) నిధులను సమీకరించగలిగాయి. ఈ విషయాన్ని ఎంట్రాకర్ ఒక ప్రత్యేక కథనంలో వెల్లడించింది. క్లోవర్, ఆర్య, దేహాట్, బీజాక్, కామతన్ ఫార్మ్ టెక్ అనే స్టార్టప్ కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. నిధులు అందించిన ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ సైకోయా కాపిటల్ కూడా ఉండటం విశేషం. ఈ కంపెనీల్లో దేహాట్, బీజాక్ అనే స్టార్టుప్ కంపెనీలు ఒక్కోటి సుమారు రూ 90 కోట్ల నిధులను సమీకరించటం విశేషం. ఇందులో దేహాట్ అనే కంపెనీ బీహార్ రాజధాని పాట్నా కేంద్రంగా సేవలు అందిస్తుండటం మరో విశేషం.

అదరగొడుతున్న నింజా కార్ట్, వే కూల్...

అదరగొడుతున్న నింజా కార్ట్, వే కూల్...

భారత దేశం ఇప్పటికీ 70% ఆధారపడి వ్యవసాయ రంగంపై అటు స్టార్టుప్ కంపెనీలు కానీ, ఇటు ఇన్వెస్టర్లు కానీ పెద్దగా దృష్టి సారించలేదు. కానీ ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. నేరుగా వ్యవసాయం, లేదా వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా రంగంలో నిమగ్నమైన స్టార్టుప్ కంపెనీలకు పెట్టుబడిదారుల చేయూత లభిస్తోంది. ఈ రంగంలో చాలా కాలం క్రితమే ప్రారంభమై చెప్పుకోదగ్గ నిధులను సాధించిన కంపెనీల్లో నింజాకార్ట్ ఒకటి. బెంగళూరుకు చెందిన ఈ స్టార్టుప్ కంపెనీ ఇప్పటి వరకు 100 మిలియన్ డాలర్ల (సుమారు రూ 750 కోట్లు) పెట్టుబడులను సమీకరించి ఔరా అనిపించింది. అలాగే చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న వేకూల్ అనే స్టార్టుప్ కంపెనీ కూడా పెద్ద మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించటంతో పాటు ఈ రంగంలో నిలదొక్కుకుని చెప్పుకోదగిన పురోగతి సాధించింది.

ఇప్పుడే ఎందుకు...

ఇప్పుడే ఎందుకు...

ఇండియా లోకి కరోనా వైరస్ వ్యాప్తి చెందటంతో దేశం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో నిత్యావసర వస్తువుల సరఫరా, వాటి లభ్యత పై అందరి దృష్టి పడింది. ఉద్యోగం ఉన్నా లేకున్నా... పని చేసినా చేయకున్నా ప్రతి రోజు అన్నం మాత్రం తినాల్సిందే. మరి 135 కోట్ల మంది భారతీయులకు మూడు పూటలా భోజనం అందించాలంటే వ్యవసాయ రంగం ఎంత పటిష్టంగా ఉండాలి. వ్యవసాయ ఉత్పత్తులు ఎంత వేగంగా పెరగాలి. ఒక వైపు మన అవసరాలను తీర్చుకుంటూనే... మన దేశం నుంచి ఎగుమతి చేస్తే ఇంకా ఎంత పెద్ద మార్కెట్ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడు ఇదే ప్రశ్న అందరినీ తొలుస్తోంది. కాబట్టి, ఇప్పుడైనా.. భవిష్యత్లో అయినా ఆహార రంగం వృద్ధి చెందుతూనే ఉంటుంది కాబట్టి... ఈ రంగంలో నిమగ్నమైన స్టార్టుప్ కంపెనీలు నిలదొక్కుకొని భవిష్యత్ లో మెరుగైన రాబడులను అందించగలవని ఇన్వెస్టర్లు నమ్ముతున్నారు. అందుకే, ఈ హడావిడి!

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+