అగ్రరాజ్యం అమెరికా.. వెనిజువెలాపై గత వారం దాడులతో విరుచుకుపడిన సంగతి విదితమే. జనవరి 3న కారకాస్‌లో జరిగిన దాడిలో అమెరికా ప్రత్యేక దళాలు నికోలస్ మదురోను అరెస్టు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన న్యూయార్క్ కోర్టులో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మాదకద్రవ్య-ఉగ్రవాదం వంటి తీవ్రమైన అభియోగాలను ఎదుర్కొంటున్నారు. ఈ ఘటన ప్రపంచ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది.
తాజాగా వెనిజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో అధికారంలోకి వచ్చిన మొదట్లో దేశంలోని విలువైన Gold నిల్వలను భారీగా విదేశాలకు తరలించిన విషయం వెలుగులోకి వచ్చింది. కస్టమ్స్ డేటా ప్రకారం.. 2013 నుంచి 2016 మధ్యకాలంలో వెనిజువేలా దాదాపు 4.14 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లు (సుమారు 5.2 బిలియన్ డాలర్ల) విలువైన బంగారాన్ని స్విట్జర్లాండ్‌కు రవాణా చేసింది.

రాయిటర్స్ వివరించిన గణాంకాల ప్రకారం.. ఈ దక్షిణ అమెరికా దేశం మొత్తం 113 మెట్రిక్ టన్నుల బంగారాన్ని స్విట్జర్లాండ్‌కు ఎగుమతి చేసింది. ఆ సమయంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వెనిజువెలా ప్రభుత్వం.. దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకునేందుకు కేంద్ర బ్యాంక్ బంగారు నిల్వలను విక్రయించినట్లు స్విస్ ప్రభుత్వ ప్రసార సంస్థ SRF వెల్లడించింది. విదేశీ కరెన్సీ కొరత, పెరిగిపోయిన ద్రవ్యోల్బణం, చమురు ఆదాయాల పతనం వంటి కారణాలతో వెనిజువెలా ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దిగజారింది.
అయితే 2017 నుంచి పరిస్థితి పూర్తిగా మారింది. యూరోపియన్ యూనియన్ వెనిజువెలాపై ఆంక్షలు విధించిన తర్వాత.. 2017 నుంచి 2025 వరకు స్విట్జర్లాండ్‌కు వెనిజువేలా నుంచి ఒక్క గ్రాము gold కూడా ఎగుమతి కాలేదని కస్టమ్స్ డేటా స్పష్టం చేస్తోంది. మానవ హక్కుల ఉల్లంఘనలు, ప్రజాస్వామ్య విలువల అణచివేత ఆరోపణలతో యూరోపియన్ యూనియన్ 2017లో ఆంక్షలు విధించగా.. 2018 ప్రారంభంలో స్విట్జర్లాండ్ కూడా ఆ ఆంక్షలను అనుసరించింది.
మదురో అరెస్టు తర్వాత, స్విట్జర్లాండ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మదురోతో పాటు అతని 36 మంది సహచరులకు చెందిన ఆస్తులను స్విస్ భూభాగంలో స్తంభింపజేయాలని ఆదేశించింది. అయితే ఆ ఆస్తుల విలువ ఎంత.. అవి ఎక్కడి నుంచి వచ్చాయి అన్న వివరాలను స్విస్ అధికారులు వెల్లడించలేదు. ఈ స్తంభింపజేసిన ఆస్తులకు.. గతంలో వెనిజువేలా కేంద్ర బ్యాంక్ నుంచి బదిలీ అయిన బంగారానికి ఏమైనా సంబంధం ఉందా అనే అంశం ఇప్పటికీ స్పష్టతకు రాలేదు.
SRF నివేదిక ప్రకారం.. వెనిజువెలా బంగారాన్ని ప్రాసెసింగ్, నాణ్యత సర్టిఫికేషన్, తదుపరి అంతర్జాతీయ రవాణా కోసం స్విట్జర్లాండ్‌కు తరలించి ఉండవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు శుద్ధి కేంద్రాల్లో స్విట్జర్లాండ్ ఒకటి. అక్కడ ఐదు ప్రధాన బంగారు శుద్ధి కర్మాగారాలు పనిచేస్తున్నాయి, ఇవి ప్రపంచవ్యాప్తంగా బంగారు వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
స్టోన్‌ఎక్స్‌కు చెందిన మార్కెట్ విశ్లేషకురాలు రోనా ఓకానెల్ మాట్లాడుతూ.. 2012 నుంచి 2016 మధ్య వెనిజులా సెంట్రల్ బ్యాంక్ తీవ్ర ఒత్తిడిలో బంగారాన్ని విక్రయించింది. ఆ బంగారంలో ఎక్కువ భాగం స్విట్జర్లాండ్‌కు వచ్చి ఉండే అవకాశం ఉందని తెలిపారు. ఆ తర్వాత ఆ బంగారం ఆర్థిక వ్యవస్థలోనే నిల్వగా ఉండి ఉండవచ్చు లేదా ఆసియా సహా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు చిన్న బార్‌ల రూపంలో విక్రయించి ఉండవచ్చని ఆమె అంచనా వేశారు. 2017 తర్వాత బంగారం ఎగుమతులు సున్నాకు పడిపోవడానికి మరో కారణం కూడా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. వెనిజులా కేంద్ర బ్యాంక్ వద్ద బంగారు నిల్వలు గణనీయంగా తగ్గిపోవడం వల్ల ఇక ఎగుమతులకు అవకాశం లేకపోయి ఉండవచ్చని ఓకానెల్ అభిప్రాయపడ్డారు.
More From GoodReturns

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు



Click it and Unblock the Notifications