వెనిజువెలా వద్ద వేల కోట్ల విలువైన బిట్‌కాయిన్.. ఒక్కసారిగా షేక్ అయిన గ్లోబల్ క్రిప్టో మార్కెట్..

గత వారాంతంలో వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో అధికార పతనం తరువాత.. ప్రపంచ దృష్టి మళ్లీ ఆ దేశ సంపదలపై కేంద్రీకృతమైంది. ఇప్పటివరకు ప్రధానంగా వెనిజులా వద్ద ఉన్న విస్తారమైన చమురు నిల్వల గురించే చర్చ సాగినా.. ఇప్పుడు మరో కీలకమైన దాదాపు కనిపించని ఆస్తి బిట్‌కాయిన్ పై ఊహాగానాలు మొదలయ్యాయి. వెనిజులా భారీ మొత్తంలో క్రిప్టోకరెన్సీని రహస్యంగా దాచి వుంచిందా? అనే ప్రశ్న గ్లోబల్ క్రిప్టో మార్కెట్లను కుదిపేస్తోంది.

CNBCతో మాట్లాడిన పలువురు క్రిప్టో, జియోపాలిటికల్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వెనిజులా వద్ద బిలియన్ల డాలర్ల విలువైన బిట్‌కాయిన్ ఉండే అవకాశం పూర్తిగా కొట్టిపారేయలేనిది. అయితే, ఖచ్చితమైన సంఖ్యను నిర్ధారించడం దాదాపు అసాధ్యం. లాటిన్ అమెరికాకు చెందిన బిట్‌కాయిన్ సంస్థ ఆరంజ్‌బిటిసి వ్యవస్థాపకుడు, సీఈఓ గుయ్ గోమ్స్ మాట్లాడుతూ..వెనిజులాకు బిట్‌కాయిన్‌పై గణనీయమైన బహిర్గతం ఉందని భావించడం న్యాయమే. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నుంచి వెలివేయబడిన దేశం తన సంపదను బంగారం, బిట్‌కాయిన్, కొంత డాలర్ల రూపంలో దాచుకునే అవకాశం ఉందని అన్నారు.

Venezuela bitcoin Venezuela hiding bitcoin 60 billion bitcoin Venezuela Maduro fall crypto markets Venezuela crypto reserves hidden bitcoin stash Venezuela bitcoin rumors Maduro arrest bitcoin Venezuela shadow bitcoin reserve bitcoin market volatility global crypto markets news bitcoin supply shock Venezuela crypto scandal Maduro bitcoin hoard cryptocurrency latest news 60

అమెరికా విధించిన కఠిన ఆంక్షల కారణంగా, వెనిజులా చాలా సంవత్సరాలుగా అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఆంక్షలను దాటవేయడానికి మదురో పాలన క్రిప్టోకరెన్సీలను ఒక ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగించి ఉండవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బిట్‌కాయిన్ వికేంద్రీకృత స్వభావం, గోప్యత కారణంగా, దేశం ఎంత మొత్తాన్ని కలిగి ఉందో, ఆ నిధులు ఎక్కడ నిల్వయ్యాయో తెలుసుకోవడం చాలా కష్టం.

ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చిన విషయం ఏమిటంటే..డిజిటల్ మీడియా సంస్థ 'ప్రాజెక్ట్ బ్రేజెన్' వెనిజులా వద్ద దాదాపు 60 బిలియన్ డాలర్ల విలువైన బిట్‌కాయిన్ ఉండవచ్చని పేరులేని మూలాలను ఉటంకిస్తూ నివేదిక వెలువరించింది. అయితే, ఈ సంఖ్యను బ్లాక్‌చెయిన్ విశ్లేషణ ద్వారా ఇప్పటివరకు నిర్ధారించలేదు. ఇక Bitcointreasuries.net అనే వెబ్‌సైట్ వెనిజులా వద్ద కేవలం 240 బిట్‌కాయిన్‌లు మాత్రమే ఉన్నాయని అంచనా వేసింది. వాటి విలువ సుమారు 22 మిలియన్ డాలర్లు. ఈ అంచనా థర్డ్ పార్టీ బ్లాక్‌చెయిన్ డేటా ఆధారంగా చేయబడినదైనా, నిపుణులు ఇలాంటి గణాంకాలను చాలా జాగ్రత్తగా చూడాలని హెచ్చరిస్తున్నారు.

హాన్ వెంచర్స్ జనరల్ పార్ట్‌నర్ డియోగో మోనికా మాట్లాడుతూ.. బిట్‌కాయిన్‌ను రహస్యంగా నిల్వ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. సరైన పద్ధతులు ఉపయోగిస్తే, అత్యంత భద్రతతో ఆస్తులను దాచడం చాలా సులభం అన్నారు. గోమ్స్ అభిప్రాయం ప్రకారం.. వెనిజులా వద్ద ఉన్న ఏదైనా బిట్‌కాయిన్ వేలాది డిజిటల్ వాలెట్లలో విస్తరించి ఉండవచ్చు. ఇవి సైనిక అధికారులు, రాజకీయ అంతర్గత వ్యక్తుల నియంత్రణలో ఉండే అవకాశం ఉంది. ఇదే ట్రాకింగ్‌ను మరింత క్లిష్టతరం చేస్తోంది.

చైనాలిసిస్ సంస్థలో జాతీయ భద్రతా నిఘా విభాగం అధిపతి ఆండ్రూ ఫైర్‌మాన్ మాట్లాడుతూ..ఒక టన్ను బంగారాన్ని ప్రైవేట్ జెట్‌లో తరలించగలిగితే, అదే విధంగా క్రిప్టో ఆస్తులను సంపద నిల్వకు, సరిహద్దు వ్యాపారానికి వినియోగించడం అసాధ్యం కాదని అన్నారు. వెనిజులాకు క్రిప్టోతో గతంలోనూ అనుభవం ఉంది. 2018లో మదురో ప్రభుత్వం 'పెట్రో' అనే రాష్ట్ర మద్దతు గల టోకెన్‌ను ప్రారంభించింది. అయితే అది విఫలమై 2024లో అధికారికంగా నిలిపివేయబడింది. ఒక దశలో ప్రభుత్వం బిట్‌కాయిన్ మైనింగ్‌ను ప్రోత్సహించినప్పటికీ, తర్వాత మైనింగ్ యజమానులపై దాడులు చేసి, వారిని అరెస్టులు చేసి, చివరికి మైనింగ్‌ను పూర్తిగా నిషేధించింది.

ఇప్పుడు మదురో పాలన కూలిన నేపథ్యంలో.. వెనిజులా వద్ద ఉన్న క్రిప్టో ఆస్తులకు ఏమవుతుందన్నది స్పష్టంగా లేదు. రిజర్వ్ వన్ అధ్యక్షుడు మరియు సీఎఐఓ సెబాస్టియన్ పెడ్రో బీ మాట్లాడుతూ..ఏ దేశంలో అయినా అకస్మాత్తుగా అధికార మార్పు జరిగితే, ఆ దేశ ఆస్తులు అస్థిరంగా మారతాయని అన్నారు. అమెరికా అధికారులు ఆంక్షలు విధించబడిన వెనిజులా అధికారులతో సంబంధం ఉన్న బిట్‌కాయిన్‌ను స్వాధీనం చేసుకునే అవకాశం కూడా ఉందని బీ చెప్పారు. అలా జరిగితే, ఆ Bitcoin నేరుగా అమెరికా ట్రెజరీకి వెళ్లే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఏదేమైనా వెనిజులా బిట్‌కాయిన్‌ను విక్రయించినా, స్వాధీనం చేసుకున్నా లేదా అలాగే ఉంచుకున్నా.. ఆ నిర్ణయం ప్రపంచ క్రిప్టో మార్కెట్లపై పెద్ద ప్రభావాన్ని చూపడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+