For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Dividend Multibagger: లక్షను రూ.58 లక్షలు చేసిన మల్టీబ్యాగర్.. రూ.13 డివిడెంట్ ఇస్తోంది.. మీ దగ్గర ఉందా..?

|

Dividend Multibagger: ఈ మధ్య కాలంలో స్మాల్ క్యాప్ కంపెనీలు ఇన్వెస్టర్లకు భారీగా లాభాలను అందిస్తున్నాయి. మల్టీబ్యాగర్ రాబడులను అందించటంతో పాటు డివిడెండ్ ఆదాయాన్ని సైతం అందిస్తున్నాయి. అలా దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు ధనవంతులను చేయటంతో పాటు ప్రస్తుతం స్టాక్ మంచి రాబడులను సైతం అందిస్తోంది.

కంపెనీ వివరాలు..

కంపెనీ వివరాలు..

ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది Veljan Denison Limited స్టాక్ గురించే. 1965లో స్థాపించబడిన ఈ స్మాల్ క్యాప్ కంపెనీ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం రూ.309.42 కోట్లుగా ఉంది. కంపెనీ పంపులు, మోటార్లు, వాల్వ్‌లు, అనుకూల-నిర్మిత పవర్ సిస్టమ్‌లు/మానిఫోల్డ్ బ్లాక్‌లను తయారుచేసే వ్యాపారంలో కంపెనీ ఉంది. గడచిన 50 ఏళ్లుగా కంపెనీ అనేక రకాల ఎయిర్ అండ్ హైడ్రాలిక్ ఉత్పత్తులు, విడిభాగాల అభివృద్ధి వ్యాపారంలో ఉంది.

రికార్డు తేదీ..

రికార్డు తేదీ..

ప్రస్తుతం కంపెనీ తన ఇన్వెస్టర్లకు డివిడెండ్ చెల్లించనున్నట్లు ప్రకటించింది. దీనికోసం సెప్టెంబర్ 23, 2022ని రికార్డు తేదీగా ప్రకటించింది. అంటే రికార్డు లేదీలోపు షేర్లు కలిగిఉన్న ఇన్వెస్టర్లకు కంపెనీ ప్రకటించిన రూ.13 డివిడెండ్ చెల్లించబడుతుంది. కంపెనీ తన 48వ యాన్యువల్ జనరల్ మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకుంది. బోర్డు సభ్యులు దీనికి ఆమోదం తెలిపారు.

షేర్ ధర హిస్టరీ..

షేర్ ధర హిస్టరీ..

కంపెనీ షేర్ విలువ డిసెంబర్ 12, 2002న రూ.23.53గా ఉంది. ఈ రోజు 11.55 గంటల సమయంలో షేర్ ధర రూ.1,370.90గా ఉంది. శుక్రవారం షేర్ ధర రూ.1,375.20 వద్ద ముగిసింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటికి షేర్ విలువ 7.07% పెరిగింది. స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ. 850.95 వద్ద ఉండగా.. షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ.1,449గా ఉంది. ఈ క్రమంలో ఏవరైనా ఇన్వెస్టర్ రూ.23.53 ధర వద్ద లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం అతను రూ. 58 లక్షలకు పైగా రాబడిని అందుకునేవారు.

English summary

Dividend Multibagger: లక్షను రూ.58 లక్షలు చేసిన మల్టీబ్యాగర్.. రూ.13 డివిడెంట్ ఇస్తోంది.. మీ దగ్గర ఉందా..? | Veljan Denison Limited multibagger stock now announced rs 13 dividend per share to investors

Veljan Denison Limited multibagger stock now announced rs 13 dividend per share to investors
Story first published: Monday, September 19, 2022, 12:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X